Peace గురించి బైబిల్ వచనాలు: Social
Social గురించి వచనాలు
తర్వాత తన సోదరులను పంపిస్తూ, వారు వెళ్లేటప్పుడు, “మీలో మీరు గొడవపడకండి!” అని చెప్పాడు.
“ ‘నేను దేశంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాను, మీరు పడుకుంటారు, ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. నేను దేశం నుండి అడవి జంతువులను తొలగిస్తాను, ఖడ్గం మీ దేశం గుండా వెళ్లదు.
ఎందుకంటే పొలం లోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు, అడవి జంతువులు నీతో సమాధానంగా ఉంటాయి.
నీ గుడారం క్షేమనివాసమని నీవు తెలుసుకుంటావు; నీ ఆస్తులను లెక్క చూడగా వాటిలో ఒకటి కూడా పోదు.
కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
సమాధానాన్ని ద్వేషించేవారి మధ్యలో చాలా కాలం నివసించాను.
నేను సమాధానం కోరుతున్నాను; కానీ వారు యుద్ధాన్ని కోరుతున్నారు.
దావీదు యాత్రకీర్తన సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు! ఎంత మనోహరం!
కీడును కలిగించువారి హృదయంలో మోసము కలదు సమాధానపరచడానికి ఆలోచన చెప్పువారు సంతోషముగా ఉందురు.
ద్వేషం కలిగిన చోట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే, ప్రేమ ఉన్నచోట ఆకుకూరల భోజనం తినడం మేలు.
ఒక వ్యక్తి మార్గాలు యెహోవాకు నచ్చినప్పుడు, అతడు వాని శత్రువులను వానితో సమాధానపరుస్తారు.
తగాదాలతో కూడిన విందు కలిగి ఉన్న ఇంటి కంటే, సమాధానం నిశ్శబ్దంతో ఎండిన రొట్టె ముక్క తినుట మేలు.
గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.
తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత, మూర్ఖులు జగడాన్నే కోరును.
రెండు చేతులతో గాలి కోసం శ్రమించడం కంటే ఒక చేతినిండ నెమ్మది ఉంటే అది ఎంతో మేలు.
ఆయన దేశాల మధ్య తీర్పు తీరుస్తారు, అనేక జనాంగాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద ఖడ్గం ఎత్తదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.
నేను వెలుగును రూపిస్తాను, చీకటిని కలుగజేస్తాను, నేను వృద్ధిని తెస్తాను, విపత్తును కలుగజేస్తాను. యెహోవానైన నేను వీటన్నిటిని చేస్తాను.
అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”
ఆ రోజున నా ప్రజల కోసం అడవి జంతువులతో, ఆకాశ పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో నిబంధన చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం దేశంలో లేకుండా చేస్తాను, అప్పుడు వారు క్షేమంగా పడుకుంటారు.
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”
సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.
“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.
నన్ను బట్టి మీరు వారందరిచేత ద్వేషించబడతారు, అయితే అంతం వరకు స్థిరంగా నిలిచి ఉండేవారే రక్షించబడతారు.
“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని అనుకోకండి. నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చానే గాని సమాధానం తేవడానికి కాదు.
ఎలాగంటే, “ ‘తన తండ్రికి వ్యతిరేకంగా కుమారుడు తన తల్లికి వ్యతిరేకంగా కుమార్తె, తన అత్తకు వ్యతిరేకంగా కోడలు తిరగబడతారు.