Skip to content

Parables గురించి బైబిల్ వచనాలు

452 వచనాలు · 74 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ఆ పేదవాడు చనిపోయినప్పుడు దేవదూతలు వానిని అబ్రాహాము రొమ్మున ఆనుకోడానికి తీసుకెళ్లారు. అలాగే ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడ్డాడు.

  2. ధనవంతుడు నరకంలో యాతనపడుతు, దూరం నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూశాడు.

  3. వెంటనే అతడు, ‘తండ్రీ అబ్రాహామూ, నేను అగ్నిలో అల్లాడి పోతున్నాను. నా మీద కనికరం చూపించి, తన చేతివ్రేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించవా’ అని కేక వేశాడు.

  4. “అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు.

  5. వీటన్నిటితో పాటు, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది కాబట్టి ఇక్కడి వారు అక్కడికి గాని అక్కడి వారు ఇక్కడకు గాని రాలేరు’ అన్నాడు.

  6. “అందుకు అతడు, ‘అయితే తండ్రీ, నా కుటుంబంలో నాకు అయిదుగురు సహోదరులు ఉన్నారు. వారు కూడ ఇక్కడకు వచ్చి వేదన పడకుండా వారిని హెచ్చరించడానికి లాజరును పంపించమని నిన్ను వేడుకొంటున్నాను’ అన్నాడు.

  7. For I have five brethren; that he may testify unto them, lest they also come into this place of torment.

  8. “అందుకు అబ్రాహాము, ‘వారికి మోషే ప్రవక్తలు ఉన్నారు, వారు వీరి మాటలను విననివ్వు’ అన్నాడు.

  9. “అందుకు అతడు, ‘కాదు, తండ్రీ అబ్రాహామూ, చనిపోయినవారిలో నుండి ఎవరైనా వెళ్తే, వారు పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.

  10. “అందుకు అబ్రాహాము అతనితో, ‘వారు మోషే మాటలు గాని ప్రవక్తల మాటలు గాని వినకపోతే చనిపోయినవారిలో నుండి ఒకడు లేచి వెళ్లినా నమ్మరు’ అన్నాడు.”

  11. ఒక రోజు యేసు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలి అనే విషయాన్ని ఉపమానరీతిగా చెప్పారు:

  12. “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుని భయం లేదు, మనుష్యులను లెక్క చేసేవాడు కాడు.

  13. ఆ పట్టణంలో ఒక విధవరాలు అతని దగ్గరకు తరచుగా వస్తూ, ‘నా విరోధి విషయంలో నాకు న్యాయం తీర్చండి’ అని అడుగుతూ ఉండేది.

  14. “అతడు కొంతకాలం వరకు ఆమె మాటలను తిరస్కరించాడు కానీ, అతడు తనలో తాను, ‘నేను దేవునికి భయపడకపోయినా లేదా మనుష్యులను లక్ష్యపెట్టక పోయినా,

  15. ఈ విధవరాలు, “నాకు న్యాయం చేయండి” అని నన్ను తరచుగా తొందర పెడుతుంది, కాబట్టి ఆమె మాటిమాటికి వచ్చి నన్ను విసిగించకుండా, నేను ఆమెకు న్యాయం చేస్తాను’ అని అనుకున్నాడు.”

  16. కాబట్టి ప్రభువు దాని గురించి, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఏమన్నాడో వినండి.

  17. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు, దివారాత్రులు తనకు మొరపెడుతున్న వారికి న్యాయం చేయరా? వారికి న్యాయం చేయడంలో ఆలస్యం చేస్తారా?

  18. నేను చెప్పేది ఏంటంటే, ఆయన వారికి న్యాయం జరిగేలా చేస్తారు, అది కూడా అతిత్వరలో చేస్తారు. అయినా మనుష్యకుమారుడు వచ్చినప్పుడు, ఆయనకు భూమి మీద వారిలో విశ్వాసం కనిపిస్తుందా?” అని అడిగారు.

  19. తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఇతరులను చిన్న చూపు చూసేవారితో యేసు ఈ ఉపమానం చెప్పారు:

  20. “ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు మరొకడు పన్నులు వసూలు చేసేవాడు.

  21. పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థించాడు: ‘దేవా, నేను దొంగలు, అన్యాయస్థులు వ్యభిచారుల వంటి ఇతరుల్లా కాని, ఈ పన్నులు వసూలు చేసేవాని వలె కాని లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

  22. నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’

  23. “అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడి, తలను పైకెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక, రొమ్ము కొట్టుకొంటూ, ‘దేవా, నేను పాపిని, నన్ను కరుణించు’ అని వేడుకొన్నాడు.

  24. “నేను మీతో చెప్పేది ఏంటంటే, పరిసయ్యుని కంటే పన్నులు వసూలు చేసేవాడే దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.”

  25. “గొప్ప జన్మించిన వ్యక్తి సుదూర దేశానికి వెళ్లి తనను తాను రాజుగా నియమించుకొని తిరిగి వచ్చేయాలి.