Skip to content

Oaths గురించి బైబిల్ వచనాలు

94 వచనాలు · 41 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. గిబియోనీయులతో సమాధాన ఒడంబడిక చేసుకున్న మూడు రోజుల తర్వాత, వారు తమ పొరుగువారని, తమ దగ్గర నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు విన్నారు.

  2. అయితే సమాజ నాయకులంతా, “మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున వారికి ప్రమాణం చేశాం కాబట్టి ఇప్పుడు మనం వారిని తాకకూడదు.

  3. మనం వారికి చేసిన ప్రమాణం వల్ల మన మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండేలా వారిని బ్రతుకనిద్దాం” అన్నారు.

  4. మీ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దు; వారి దేవతల పేర్లు ఎత్తవద్దు; వాటిపై ప్రమాణం చేయవద్దు. మీరు వాటిని సేవించవద్దు లేదా వాటికి నమస్కరించవద్దు.

  5. అందుకు గిద్యోను, “వారు నా సోదరులు, నా సొంత తల్లి కుమారులు. మీరు వారిని బ్రతకనిచ్చి ఉంటే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని చంపేవాడిని కాదు” అన్నాడు.

  6. అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మ్రొక్కుబడి చేశాడు: “మీరు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే,

  7. నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”

  8. తర్వాత యెఫ్తా అమ్మోనీయులతో పోరాడడానికి వెళ్లాడు, యెహోవా వారని అతని చేతికి అప్పగించారు.

  9. అతడు అరోయేరు నుండి మిన్నీతు వరకు, అలా ఆబేల్-కెరామీము వరకు ఇరవై పట్టణాలను నాశనం చేశాడు. ఇలా ఇశ్రాయేలు అమ్మోనును లోబరచుకుంది.

  10. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తంబురలతో నాట్యం చేస్తూ అతన్ని ఎదుర్కోడానికి వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె తప్ప అతనికి కుమారుడు కాని కుమార్తె కాని లేరు.

  11. అతడు ఆమెను చూడగానే తన బట్టలు చింపుకొని ఏడుస్తూ, “ఓ నా బిడ్డా, నన్ను కృంగదీశావు, నేను నాశనం అయిపోయాను. నేను యెహోవాకు మ్రొక్కుబడి చేశాను, దానిని మీరలేను” అన్నాడు.

  12. ఆమె అతనితో, “నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావు. నీవు ప్రమాణం చేసిన ప్రకారం నాకు చేయు, ఎందుకంటే యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నారు.

  13. వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.

  14. నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను విడదీస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక.”

  15. ఈ రాత్రి ఇక్కడ ఉండు, ప్రొద్దున అతడు నీకు బంధువుని ధర్మం జరిగిస్తే మంచిది; అతడు నిన్ను విడిపిస్తాడు. అయితే అతడు ఒప్పుకోకపోతే, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడిపిస్తాను. ఉదయం వరకు ఇక్కడ పడుకో” అని చెప్పాడు.

  16. ఆమె అతనితో, “నా ప్రభువా, నన్ను క్షమించండి. మీ జీవం తోడు ఇక్కడ మీ ప్రక్కన నిలబడి యెహోవాకు ప్రార్థించిన స్త్రీని నేనే.

  17. అప్పుడు ఏలీ, “యెహోవా నీతో ఏమి చెప్పారు? వాటిలో ఏదీ నా దగ్గర దాచవద్దు. ఆయన నీతో చెప్పిన సంగతుల్లో ఏదైనా నీవు దాచిపెడితే దేవుడు నిన్ను తీవ్రంగా శిక్షించును గాక” అన్నాడు.

  18. అయితే యోనాతాను తన తండ్రి ప్రజలతో చేయించిన ప్రమాణాన్ని వినలేదు కాబట్టి తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని అంచును తేనెతెట్టెలో ముంచి తన చేయి నోటిలో పెట్టుకున్నప్పుడు అతని కళ్లు ప్రకాశించాయి.

  19. అందుకు సౌలు, “యోనాతానూ, నీవు ఖచ్చితంగా చనిపోవాలి లేకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తారు” అన్నాడు.

  20. “యెహోవా దావీదు యొక్క శత్రువులు లెక్క అప్పగించేలా చేయును గాక” అని చెప్తూ యోనాతాను దావీదు కుటుంబంతో నిబంధన చేశాడు.

  21. యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించాడు కాబట్టి తనకున్న ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించాడు.

  22. నా ప్రభువా, మీ దేవుడైన యెహోవా పేరిట, మీ జీవం తోడు, రక్తం చిందించకుండ మీ చేతులతో మీరే పగతీర్చుకోకుండా యెహోవా మిమ్మల్ని ఆపారు. మీ శత్రువులు నా ప్రభువైన మీకు కీడు చేయాలనుకునే వారికి నాబాలు గతే పడుతుంది.

  23. ఇప్పుడు మీరు లేచి బయటకు వచ్చి మీ సైన్యాన్ని ప్రోత్సహించండి. మీరు ఇప్పుడు బయటకు రాకపోతే ఈ రాత్రి వారిలో ఒక్కడూ మీ దగ్గర ఉండరని యెహోవా పేరిట ఒట్టు పెట్టి చెప్తున్నాను. అది మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీకు వచ్చిన కష్టాల కన్నా తీవ్రంగా ఉంటుంది” అని అన్నాడు.

  24. దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.

  25. రాజు షిమీని పిలిపించి అతనితో, “ ‘నీవు ఉన్నచోట నుండి ఎక్కడికి వెళ్లినా నీవు ఖచ్చితంగా చస్తావు’ అని యెహోవా పేరిట ప్రమాణం చేయించి నిన్ను హెచ్చరించలేదా? అప్పుడు నీవు నాతో, ‘మీరు చెప్పింది మంచిది. నేను లోబడతాను’ అని అన్నావు.