Skip to content

Miracles గురించి బైబిల్ వచనాలు

338 వచనాలు · 37 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలీయులు దాటే వరకు యెహోవా యొర్దానును వారి ముందు ఆరిపోయేలా చేశారని యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులందరూ, మధ్యధరా తీరం వెంబడి నివసించిన కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు కరిగి నీరై ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది.

  2. యెహోషువ జీవించినంత కాలం, అతనికంటే ఎక్కువకాలం జీవించి యెహోవా ఇశ్రాయేలులో చేసిన గొప్ప కార్యాల గురించి తెలిసిన పెద్దలు ఉన్నంతకాలం ప్రజలు యెహోవాను సేవించారు.

  3. అందుకు గిద్యోను జవాబిస్తూ, “నన్ను క్షమించండి, నా ప్రభువా, ఒకవేళ యెహోవా మాకు తోడుంటే, ఇదంతా మాకెందుకు జరిగింది? మా పూర్వికులు, ‘యెహోవా ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకురాలేదా?’ అని చెప్పిన ఆ అద్భుతాలన్ని ఎక్కడా? కాని ఇప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించారు” అన్నాడు.

  4. అందుకు గిద్యోను అన్నాడు, “మీ దృష్టిలో నా పట్ల దయ ఉంటే, మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నట్లు నాకొక గుర్తు ఇవ్వండి.

  5. నేను తిరగి వచ్చి, నా అర్పణ తెచ్చి, మీ ముందు పెట్టే వరకు మీరు వెళ్లకండి.” అందుకు యెహోవా అన్నారు, “నీవు తిరిగి వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటాను.”

  6. గిద్యోను లోనికి వెళ్లి ఒక మేకపిల్లను సిద్ధపరచి, తూమెడు పిండితో పులియని రొట్టెల చేసి, మాంసాన్ని గంపలో, రసాన్ని కుండలో పెట్టుకొని తెచ్చి, మస్తకిచెట్టు క్రింద ఆయనకు అర్పించాడు.

  7. దేవుని దూత అతనితో, “మాంసాన్ని, పులియని రొట్టెలను తీసుకుని ఈ రాతి మీద పెట్టి, ఆ రసం దాని మీద పోయి” అన్నాడు. గిద్యోను అలాగే చేశాడు.

  8. అప్పుడు యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని కొనతో మాంసాన్ని ఆ పులియని రొట్టెలను తాకినప్పుడు, అగ్ని ఆ రాతిలో నుండి బయటకు వచ్చి ఆ మాంసాన్ని రొట్టెలను కాల్చివేసింది, యెహోవా దూత అదృశ్యం అయ్యాడు.

  9. వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, “అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!” అని ఆశ్చర్యపోయాడు.

  10. గిద్యోను దేవునితో, “మీరు వాగ్దానం చేసినట్టు నా ద్వారా ఇశ్రాయేలును రక్షించాలనుకుంటే,

  11. చూడండి, నేను నూర్పిడి కళ్ళం మీద గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడి నేలంతా పొడిగా ఉంటే, మీరు చెప్పినట్టు నా ద్వారా మీరు ఇశ్రాయేలును రక్షిస్తారని గ్రహిస్తాను” అన్నాడు.

  12. అలాగే జరిగింది. గిద్యోను మరుసటిరోజు ప్రొద్దున లేచి ఆ బొచ్చు మీద ఉన్న మంచును పిండినప్పుడు ఓ పాత్ర నిండా నీళ్లు వచ్చాయి.

  13. అప్పుడు గిద్యోను దేవునితో, “నా మీద కోప్పడకండి, ఇంకొక్కటే అడుగుతాను. గొర్రెబొచ్చుతో ఇంకొక పరీక్షకు నన్ను అనుమతించండి. అయితే ఈసారి గొర్రెబొచ్చు పొడిగా ఉండి నేలంతా మంచు పడాలి” అన్నాడు.

  14. ఆ రాత్రి దేవుడు అలానే చేశారు. నేలంతా మంచు పడింది కాని బొచ్చు పొడిగా ఉంది.

  15. అప్పుడు యెరుబ్-బయలు, అనగా గిద్యోను, అతని మనుష్యులందరు పెందలకడనే లేచి హరోదు బుగ్గ దగ్గర గుడారాలు వేసుకున్నారు. మిద్యానీయుల శిబిరం లోయలో మోరె కొండ దగ్గర వారికి ఉత్తరాన ఉంది.

  16. ఈజిప్టువారు, ఫరో తమ హృదయాలను కఠినం చేసుకున్నట్లు మీరెందుకు కఠినం చేసుకుంటున్నారు? ఇశ్రాయేలీయుల దేవుడు వారితో కఠినంగా వ్యహరించినప్పుడు, వారు ఇశ్రాయేలీయులను వెళ్లనిచ్చారు; అప్పుడు ఇశ్రాయేలీయులు తమ దారిని తాము వెళ్లిపోలేదా?

  17. “కాబట్టి, మీరు క్రొత్త బండి ఒకటి తయారుచేయించి, ఇంతవరకు కాడి మోయని రెండు పాడి ఆవులను తెచ్చి బండికి కట్టాలి. కాని వాటి దూడలను వాటి దగ్గర నుండి దొడ్డికి తోలివేయాలి.

  18. యెహోవా మందసాన్ని బండిపైన ఉంచి, దాని ప్రక్కన అపరాధ పరిహారార్థబలిగా మీరు పంపుతున్న బంగారు వస్తువులు ఉన్న పెట్టెను పెట్టండి. దాని మార్గాన దాన్ని పంపండి,

  19. కాని దానిని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. అది తన సొంత ప్రాంతమైన బేత్-షెమెషు వైపుకు వెళ్తే యెహోవా మన మీదికి ఈ గొప్ప విపత్తు తెచ్చారని, అలా జరుగకపోతే మన మీదికి వచ్చిన విపత్తు ఆయన హస్తం వలన కాదని ఇది అనుకోకుండ మనకు జరిగిందని మనకు తెలుస్తుంది.”

  20. కాబట్టి వారు అలాగే చేశారు. రెండు పాడి ఆవులను తోలుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను దొడ్డికి పంపి,

  21. యెహోవా మందసాన్ని దానితో పాటు బంగారు ఎలుకలు, గడ్డల రూపాలు ఉన్న పెట్టెను వారు బండిపైన పెట్టారు.

  22. అప్పుడు ఆ ఆవులు దారిలో తిన్నగా వెళ్తూ, అరుస్తూ తిన్నగా బేత్-షెమెషు దారిలో నడిచాయి; అవి కుడికి గాని ఎడమకు గాని తిరగలేదు. ఫిలిష్తీయుల పాలకులు బేత్-షెమెషు సరిహద్దు వరకు వాటిని వెంబడిస్తూ వెళ్లారు.

  23. బేత్-షెమెషు ప్రజలు లోయలో తమ గోధుమపంటను కోస్తున్నారు. వారు కళ్ళెత్తి చూసినప్పుడు మందసం కనబడింది, వారు దాన్ని చూసి సంతోషించారు.

  24. ఆ బండి బేత్-షెమెషుకు చెందిన యెహోషువ పొలంలోనికి వచ్చి, అక్కడ ఉన్న ఒక పెద్ద బండ ప్రక్కన ఆగింది. ప్రజలు ఆ బండి కర్రలను నరికి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు.

  25. లేవీయులు యెహోవా మందసాన్ని, బంగారపు వస్తువులు ఉన్న ఆ చిన్న పెట్టెను దించి వాటిని ఆ పెద్ద బండ మీద పెట్టారు. ఆ రోజే బేత్-షెమెషు ప్రజలు యెహోవాకు దహనబలులు అర్పించి, బలులు వధించారు.