Skip to content

Mills గురించి బైబిల్ వచనాలు

15 వచనాలు · 12 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అప్పుడు ఈజిప్టులోని ప్రతి మొదటి సంతానం చస్తారు, సింహాసనం మీద కూర్చునే ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి సంతానం వరకు, పశువుల్లో కూడా మొదట పుట్టినవి చస్తాయి.

  2. ప్రజలు బయటకు వెళ్లి, తిరుగుతూ దానిని సేకరించుకొని, దానిని తిరగలితో విసరేవారు లేదా రోటిలో దంచేవారు. కుండలో దానిని ఉడకబెట్టి దానితో రొట్టెలు చేసుకునేవారు. దాని రుచి నూనెతో చేసిన అప్పడంలా ఉంటుంది.

  3. అప్పు కోసం పూచీకత్తుగా ఒక తిరగలిని గాని, తిరగలి పై రాతిని గాని తాకట్టు పెట్టకూడదు. ఎందుకంటే అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్లవుతుంది.

  4. ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగలి రాతిని పడవేయడంతో అతని కపాలం పగిలింది.

  5. ఆ ప్రజలు అతన్ని చూసి, “మన దేవుడు మన శత్రువును మన చేతులకు అప్పగించాడు, మన దేశాన్ని పాడు చేసినవాన్ని, మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు” తమ దేవున్ని పొగిడారు,

  6. యెరుబ్-బెషెతు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపారు? ఒక స్త్రీ గోడ పైనుండి అతనిపై తిరగలి రాయి వేసినందుకు అతడు తేబేసు దగ్గర చనిపోయాడు గదా? మీరు గోడ దగ్గరకు ఎందుకు వెళ్లారు?’ అని అడిగితే నీవు, ‘మీ సేవకుడూ హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పు” అన్నాడు.

  7. దాని రొమ్ము బండలా గట్టిగా, తిరుగటిరాయి క్రింది దిమ్మలా ఉంటుంది.

  8. “కన్యయైన బబులోను కుమార్తె, క్రిందికి దిగి ధూళిలో కూర్చో; బబులోనీయుల రాణి పట్టణమా, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నీవు సున్నితమైన దానవని సుకుమారివని ఇకపై పిలువబడవు.

  9. తిరగలి తీసుకుని పిండి విసురు; నీ ముసుగు తీసివేయి. లంగాలు పైకెత్తి కాలిమీద బట్ట తీసి నదులు దాటు.

  10. నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.

  11. యువకులు తిరుగటిరాళ్ల దగ్గర కష్టపడుతున్నారు; బాలురు కట్టెల బరువు మోయలేక తూలుతున్నారు.

  12. “ఎవరైనా నన్ను నమ్మిన ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకం కలిగిస్తే వారి మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వారికి మేలు.

  13. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతుంటారు, ఒక స్త్రీ కొనిపోబడుతుంది ఇంకొక స్త్రీ విడవబడుతుంది.

  14. ఆ తర్వాత ఒక బలమైన దేవదూత ఒక పెద్ద తిరుగలి రాయంత బండరాయిని తీసుకుని సముద్రంలో పడవేసి, “ఇలాంటి హింసలతో బబులోను మహా పట్టణం క్రిందికి త్రోయబడుతుంది మరి ఎన్నడు అది కనబడదు.

  15. వీణ వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం మరి ఎన్నడు నీలో వినబడదు. వ్యాపారం చేసే ఏ పనివాడైనా నీలో ఎన్నడు కనిపించడు. తిరుగలి రాయి తిప్పే శబ్దం మరెన్నడు నీలో వినబడదు.