Skip to content

Meekness గురించి బైబిల్ వచనాలు

109 వచనాలు · 29 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.

  2. మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.

  3. ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.

  4. సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి.

  5. అతడు త్రాగుబోతై ఉండకూడదు, చేయి చేసుకునేవాడు కాక, మృదు స్వభావం గలవానిగా ఉండాలి, కొట్లాడేవానిగా, డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు.

  6. అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.

  7. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.

  8. ప్రభువు సేవకుడు కొట్లాడేవానిగా ఉండకుండా అందరితో దయగలవానిగా ఉండాలి, బోధించగల సామర్థ్యం కలిగి ఉండాలి, కోపిష్ఠిగా ఉండకూడదు.

  9. దేవుడిచ్చిన తరుణంలో మారుమనస్సును పొంది సత్యాన్ని గ్రహిస్తారనే ఆశ కలిగి, తనను ఎదిరించేవారిని దీనత్వంతో సరిదిద్దాలి.

  10. వృద్ధులైన పురుషులకు, వారు తమ కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా, గౌరవించదగినవారిగా, స్వీయ నియంత్రణ కలిగినవారిగా విశ్వాసంలో, ప్రేమలో, ఓర్పులో స్థిరంగా ఉండమని బోధించు.

  11. దాసులుగా ఉన్నవారు తమ యజమానులకు ప్రతి విషయంలో లోబడి ఉండాలని, అన్ని విధాలుగా వారిని సంతోషపరచడానికి ప్రయత్నించాలని, వారికి ఎదురు చెప్పకూడదని,

  12. పరిపాలకులకు అధికారులకు లోబడుతూ విధేయత కలిగి మంచి పనులను చేయడానికి సిద్ధంగా ఉండాలని,

  13. ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, అందరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి.

  14. దేవుని చిత్తాన్ని చేసేప్పుడు మీరు పట్టుదలగా ఉండడం అవసరం, ఆయన వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకుంటారు.

  15. అందరితో సమాధానం కలిగి జీవించడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయండి; పరిశుద్ధత లేకుండ ఎవరు ప్రభువును చూడలేరు.

  16. మీరు పరిణతి చెంది సంపూర్ణులై ఏ విషయంలో కొదువలేనివారై ఉండేలా పట్టుదల తన పనిని చేయనివ్వండి.

  17. నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి తొందరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే తొందరపడి కోపపడవద్దు;

  18. కాబట్టి మీ జీవితాల్లోని సమస్త మలినాన్ని చెడును వదిలిపెట్టి, దేవుడు మీ హృదయాల్లో నాటిన వాక్యాన్ని వినయంతో అంగీకరించండి, ఎందుకంటే మీ ఆత్మలను రక్షించే శక్తి దానికే ఉంది.

  19. మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ క్రియలను మీ మంచి ప్రవర్తన ద్వారా చూపించాలి.

  20. పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.

  21. శాంతిలో విత్తిన శాంతిని కలుగజేసినవారు నీతి అనే పంట కోస్తారు.

  22. దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించండి. దయగల, సౌమ్యులైన యజమానులకే గాక కఠినులైన వారికి కూడా లోబడి ఉండండి.

  23. ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని పట్ల నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహిస్తే దేవుని అంగీకారం పొందుతారు.

  24. పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో గొప్పతనమేంటి? అయితే మంచి చేసి బాధపడాల్సి వచ్చినపుడే మీరు ఓర్పుతో భరిస్తే అది దేవుని మెచ్చుకోదగిన విషయం.

  25. దీని కోసమే మీరు పిలువబడ్డారు. ఎందుకంటే క్రీస్తు కూడా మీ కోసం బాధపడి మీరు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఒక ఉదాహరణను ఉంచారు.