Skip to content

Hypocrisy గురించి బైబిల్ వచనాలు

246 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను.

  2. అయితే న్యాయం నదీ ప్రవాహంలా, నీతి ఎన్నడూ ఎండిపోని కాలువలా ప్రవహించాలి.

  3. “ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు, మీరు నాకు బలులు, అర్పణలు తెచ్చారా?

  4. మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది.

  5. కాబట్టి నేను మిమ్మల్ని దమస్కు అవతలికి బందీలుగా పంపిస్తాను,” అని సైన్యాల దేవుడు అని పేరు కలిగిన యెహోవా అంటున్నారు.

  6. “దేశ ప్రజలందరినీ, యాజకులను ఇలా అడుగు, ‘మీరు గత డెబ్బై సంవత్సరాలుగా అయిదవ నెలలో, ఏడవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించినప్పుడు, మీరు నిజంగా నా కోసం ఉపవాసం ఉన్నారా?

  7. మీరు తినేటప్పుడు త్రాగేటప్పుడు కేవలం మీ కోసం మాత్రమే విందు చేసుకోలేదా?

  8. “కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు. “అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.

  9. “మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన ఆహారం అర్పిస్తూ, “అయినా మీరు, ‘మేము మిమ్మల్ని ఎలా అపవిత్రపరచాము?’ అని అడుగుతారు. “యెహోవా బల్లను ప్రాముఖ్యత లేనిదిగా చూడడం వల్లనే.

  10. మీరు గ్రుడ్డి జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? కుంటి దానిని, జబ్బుతో ఉన్న జంతువులను తెచ్చి బలి అర్పిస్తే తప్పు కాదా? అలాంటి వాటిని మీ అధికారికి ఇచ్చి చూడండి! అలాంటివి ఇస్తే స్వీకరిస్తాడా? అతడు నిన్ను అంగీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  11. “కానీ ఇప్పుడేమో మాపై దయచూపమని దేవుని వేడుకొంటున్నారు. మీ చేతులతో అలాంటి అర్పణలను ఇస్తే ఆయన స్వీకరిస్తాడా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  12. “మీరు నా బలిపీఠం మీద వృధాగా మంటలు వేయకుండా మీలో ఎవరైనా గుడి తలుపులు మూసివేస్తే ఎంత బాగుంటుంది! నేను మీ పట్ల సంతోషంగా లేను. నేను మీ చేతుల నుండి ఏ అర్పణను స్వీకరించను అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  13. తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  14. “కానీ మీరు, ‘యెహోవా బల్ల అపవిత్రం అయింది, దాని ఆహారం నీచమైనది’ అంటూ నా నామాన్ని అవమానపరుస్తున్నారు.

  15. పైగా, ‘ఎంత భారంగా ఉంది!’ అంటూ ఆ బల్లను తిరస్కరిస్తున్నారు” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “మీరు గాయపడిన దాన్ని కుంటి దాన్ని, జబ్బుపడిన జంతువులను తీసుకువచ్చి బలి అర్పించినప్పుడు నేను మీ చేతుల నుండి వాటిని స్వీకరించాలా?” అని యెహోవా అంటున్నారు.

  16. “తన మందలో అంగీకారయోగ్యమైన మగ జంతువు ఉండి, దానిని బలి ఇస్తానని మ్రొక్కుబడి చేసి దోషం ఉన్న జంతువును బలి అర్పించే మోసగాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే నేను గొప్ప రాజును, దేశాలకు నేనంటే భయం” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  17. అయితే తాను బాప్తిస్మం ఇస్తున్న ప్రాంతానికి పరిసయ్యులు సద్దూకయ్యులలో చాలామంది రావడం చూసి అతడు వారితో, “సర్పసంతానమా! రానున్న ఉగ్రత నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?

  18. పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి.

  19. “మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండ జాగ్రత్తపడండి. ఎందుకంటే మీరు అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర ఫలం పొందరు.

  20. “కాబట్టి మీరు ఎవరికైనా దానం చేస్తే ఇతరుల నుండి ఘనత పొందాలని సమాజమందిరాల్లోను వీధుల్లోను ప్రకటించుకునే వేషధారుల్లా బూరలు ఊదించుకోకండి. అలాంటివారు తమ పూర్తి ప్రతిఫలం పొందుకున్నారని మీతో నేను ఖచ్చితంగా చెప్తున్నాను.

  21. “ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు. కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు.

  22. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్భుతాలను చేయలేదా?’ అని అంటారు.

  23. వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే:

  24. “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి;

  25. వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ ”