Skip to content

Hypocrisy గురించి బైబిల్ వచనాలు

246 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ గురించి మీరు పరిశుద్ధ పట్టణస్థులమని చెప్పుకుంటూ ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడుతున్నామని చెప్పుకుంటున్న మీరు వినండి, ఆయన పేరు సైన్యాల యెహోవా:

  2. ప్రతిరోజు వారు నన్ను వెదకుతారు; తమ దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టని వారిగా నీతిని అనుసరించే దేశంగా నా మార్గాలు తెలుసుకోవడానికి అత్యాసక్తి చూపిస్తారు. తమకు న్యాయమైన తీర్పులు ఇవ్వాలని నన్ను అడుగుతారు, దేవుడు తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు.

  3. వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా మీరెందుకు చూడరు? మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరెందుకు గమనించరు?’ “అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు మీ పనివారినందరిని దోచుకున్నారు.

  4. మీ ఉపవాసం గొడవలతో దెబ్బలాటలతో, ఒకరినొకరు పిడికిలితో గుద్దులాడడంతో ముగుస్తుంది. మీ స్వరం పరలోకంలో వినపడాలని మీరు ఈ రోజులా ఉపవాసం ఉండకూడదు.

  5. ఇలాంటి ఉపవాసమా నేను కోరుకున్నది? మనుష్యులు ఆ ఒక్కరోజు తమను తాము తగ్గించుకుంటే సరిపోతుందా? ఒకడు జమ్ము రెల్లులా తలవంచుకొని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చోవడమే ఉపవాసమా? యెహోవాకు ఇష్టమైన ఉపవాసం ఇదేనని మీరనుకుంటున్నారా?

  6. అయితే కోడెను బలిచ్చేవారు నరబలి ఇచ్చేవారి వంటివారే, గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు, కుక్క మెడను విరిచేవారి వంటివారే; భోజనార్పణ చేసేవారు పందిరక్తం అర్పించేవారి వంటివారే, జ్ఞాపకార్థ ధూపం వేసేవారు విగ్రహాలను పూజించేవారి వంటివారే. వారు తమకిష్టమైన దుష్ట మార్గాలను ఎంచుకున్నారు వారి అసహ్యమైన పనులలో వారు సంతోషిస్తారు;

  7. కాబట్టి నేను వారి కోసం కఠినమైన శిక్షను ఎంచుకుంటాను వారు భయపడేవాటిని వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే, నేను పిలిస్తే ఎవరూ జవాబు ఇవ్వలేదు నేను మాట్లాడితే ఎవరూ వినలేదు. నా దృష్టిలో మీరు చెడుగా ప్రవర్తించి నాకు అయిష్టమైన వాటిని ఎంచుకున్నారు.”

  8. యెహోవా మాటకు భయపడేవారలారా, ఆయన మాట వినండి. “మిమ్మల్ని ద్వేషిస్తూ నా నామాన్ని బట్టి మిమ్మల్ని త్రోసివేసే మీ సొంతవారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు మహిమ కలుగును గాక!’ అని అన్నారు. అయినా వారు సిగ్గుపరచబడతారు.

  9. ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  10. యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు.

  11. కాని చూడండి, మీరు విలువలేని మోసపూరితమైన మాటలు నమ్ముతున్నారు.

  12. “ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ,

  13. తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా?

  14. మీరు నన్ను మీ దేవుడైన యెహావా దగ్గరకు పంపి, ‘మాకోసం మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి, ఆయన చెప్పే ప్రతిదీ మాతో చెప్పు, మేము అలాగే చేస్తాము’ అని చెప్పి మీరు ఘోరమైన తప్పు చేశారని గుర్తుంచుకోండి.

  15. ఈ రోజు నేను మీతో చెప్పాను, కానీ మీకు చెప్పమని నన్ను పంపిన వాటన్నిటిలో దేనికి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు.

  16. కాబట్టి ఇప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోండి: మీరు ఎక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా మీరు ఖడ్గం, కరువు, తెగులు వల్ల చనిపోతారు.”

  17. “ ‘ఇశ్రాయేలీయులు గాని వారి దేశంలో ఉంటున్న విదేశీయులు గాని నన్ను విడిచిపెట్టి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించుకుని తమ దోషాలను తమకు ఆటంకంగా పెట్టుకుని నా దగ్గర విచారణచేయమని వారు ప్రవక్త దగ్గరకు వెళ్తే వారికి యెహోవానైన నేనే స్వయంగా సమాధానం ఇస్తాను.

  18. వారికి నేను విరోధిగా ఉండి వారిని ఒక సూచనగా సామెతగా చేస్తాను. నేను వారిని నా ప్రజల నుండి తొలగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.

  19. “మనుష్యకుమారుడా, నీ ప్రజలు గోడల దగ్గర, ఇళ్ళ గుమ్మాల దగ్గర నిలబడి నీ గురించి మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు, ‘రండి యెహోవా దగ్గర నుండి వచ్చిన సందేశం ఏంటో విందాం’ అని చెప్పుకుంటున్నారు.

  20. నా ప్రజలు ఎప్పుడూ వచ్చినట్లే నీ దగ్గరకు వచ్చి మీ మాటలు వినడానికి నీ ఎదుట కూర్చుంటారు, కాని వారు వాటిని పాటించరు. వారి నోళ్ళు ప్రేమ గురించి మాట్లాడతాయి, కాని వారి హృదయాలు అన్యాయపు లాభాన్ని ఆశిస్తాయి.

  21. నిజానికి, వారికి నీవు అందమైన స్వరంతో ప్రేమ పాటలు పాడే వాడివి, వాయిద్యాన్ని చక్కగా వాయించే వాడివి తప్ప మరేమీ కాదు, ఎందుకంటే వారు మీ మాటలు వింటారు కానీ వాటిని పాటించరు.

  22. ఇశ్రాయేలు, ‘మా దేవా! మిమ్మల్ని మేము తెలుసుకున్నాం’ అని మొరపెడుతుంది.

  23. కాని ఇశ్రాయేలు మంచి దానిని విసర్జించారు; కాబట్టి శత్రువులు వారిని తరుముతారు.

  24. “మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను.

  25. మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.