Skip to content

Humility గురించి బైబిల్ వచనాలు

90 వచనాలు · 43 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ,

  2. మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.

  3. మీలో ఒకరితో ఒకరికి గల మీ సంబంధాల్లో క్రీస్తు యేసు కలిగి ఉన్న స్వభావాన్నే మీరు కూడా కలిగి ఉండండి:

  4. ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;

  5. కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు.

  6. మనుష్యునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు!

  7. అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,

  8. యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,

  9. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.

  10. నేను ఇప్పటికే ఇవన్నీ పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేనికోసం క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను.

  11. సహోదరీ సహోదరులారా, నేను ఇంతకుముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికోసం ప్రయాసపడుతున్నాను,

  12. దీనస్థితిలో ఉన్న విశ్వాసులు తమకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి.

  13. అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే వారు గడ్డి పువ్వులా కనుమరుగవుతారు.

  14. అలానే, యవ్వనస్థులారా, మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి. మీరందరు వినయం అనే వస్త్రాన్ని ధరించాలి. ఎందుకనగా, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని దీనులకు దయ చూపిస్తారు.”

  15. దేవుని బలమైన చేతి క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.