Skip to content

Humility గురించి బైబిల్ వచనాలు

90 వచనాలు · 43 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు” అన్నారు.

  2. “అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడి, తలను పైకెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక, రొమ్ము కొట్టుకొంటూ, ‘దేవా, నేను పాపిని, నన్ను కరుణించు’ అని వేడుకొన్నాడు.

  3. “నేను మీతో చెప్పేది ఏంటంటే, పరిసయ్యుని కంటే పన్నులు వసూలు చేసేవాడే దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్లాడు. ఎందుకంటే తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు. తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు.”

  4. అంతలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో పుట్టింది.

  5. యేసు వారితో, “యూదేతరుల రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు; వారి మీద అధికారం చేసేవారు తమను తాము ఉపకారులుగా పిలుచుకుంటారు.

  6. కానీ మీరు వారిలా ఉండవద్దు. దాని బదులు, మీలో గొప్పవాడు అందరిలో చిన్నవానిగా ఉండాలి, అధికారి దాసునిగా ఉండాలి.

  7. అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేదా సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్నవాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను.

  8. పెండ్లికుమార్తె పెండ్లికుమారునికే చెందుతుంది. పెండ్లికుమారుని దగ్గర ఉండి చూసుకునే స్నేహితుడు అతడు ఏమైనా చెబితే వినాలని ఎదురుచూస్తాడు. పెండ్లికుమారుని స్వరాన్ని విన్నప్పుడు అతడు ఎంతో సంతోషిస్తాడు. నా సంతోషం కూడా అలాంటిదే, ఇప్పుడు అది సంపూర్ణమయ్యింది.

  9. ఆయన హెచ్చింపబడాలి; నేను తగ్గించబడాలి.”

  10. నేను మీకు ప్రభువుగా బోధకునిగా ఉండి, మీ పాదాలు కడిగాను, కాబట్టి మీరు కూడ ఒకరి పాదాలు ఒకరు కడగాలి.

  11. నేను మీ కోసం చేసినట్లే మీరు కూడ చేయాలని నేను మీకు మాదిరిని చూపించాను.

  12. ఏ సేవకుడు తన యజమాని కన్నా గొప్పవాడు కాలేడు, అలాగే ఒక సందేశాన్ని తీసుకెళ్లేవాడు సందేశాన్ని పంపినవాని కన్నా గొప్పవాడు కాలేడని నేను మీతో చెప్పేది నిజం.

  13. ఎవరూ దేవుని ముందు తనను తాను హెచ్చించుకోకుండా ఉండడానికి, ఎన్నికచేయబడిన వారిని వ్యర్థం చేయడానికి ఈ లోకంలో నీచమైన వారిని, నిర్లక్ష్యం చేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు.

  14. That no flesh should glory in his presence.

  15. సహోదరీ సహోదరులారా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని మానవ తెలివితేటలతో గాని దేవుని మర్మాన్ని మీకు ప్రకటించలేదు.

  16. నేను మీతో ఉన్నప్పుడు సిలువవేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేని గురించి తెలియజేయకూడదని నిర్ణయించుకున్నాను.

  17. నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను.

  18. కాబట్టి అలాంటి వాని గురించి గర్విస్తాను, కాని నా గురించి అయితే నా బలహీనత గురించి తప్ప వేరు విధంగా గర్వించను.

  19. ఒకవేళ నేను గర్వించాలనుకున్నా సత్యమే చెప్తాను కాబట్టి అవివేకిని కాను. కాని నేను చేసిన దానికి లేదా చెప్పిన దానికి మించి ఎవరూ నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా నేను వాటికి దూరంగా ఉన్నాను.

  20. నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది.

  21. దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను.

  22. అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.

  23. అందుకే క్రీస్తు కోసం నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.

  24. నన్ను నేనే బుద్ధిహీనునిగా చేసుకున్నాను, కాని మీరే నన్ను బలవంతం చేశారు. నిజానికి మీరు నన్ను మెచ్చుకోవల్సింది, ఎందుకంటే, నేను వ్యర్థుడనే అయినా మీ “శ్రేష్ఠమైన అపొస్తలుల” కంటే ఏ విషయంలో తక్కువ వాడను కాను.

  25. అపొస్తలుల సూచకక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు పూర్తి సహనంతో నా వల్ల మీ మధ్య జరిగాయి.