Skip to content

Humility గురించి బైబిల్ వచనాలు: Exemplified

31 వచనాలు · 43 కోణాలు

Exemplified గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు రాజైన దావీదు లోపలికి వెళ్లి, యెహోవా సన్నిధిలో కూర్చుని ఇలా ప్రార్థించాడు: “ప్రభువైన యెహోవా! మీరు నన్ను ఈ స్థితిలోనికి తీసుకురావడానికి నేనెంతటివాన్ని? నా కుటుంబం ఏపాటిది?

  2. ప్రభువైన యెహోవా! మీ దృష్టిలో ఇది చాలదన్నట్టు మీ సేవకుని కుటుంబ భవిష్యత్తు గురించి కూడా తెలియజేశారు. ప్రభువైన యెహోవా! మామూలు మనుష్యుల పట్ల మీరు ఇంత కార్యం చేస్తారా?

  3. “మీరు మానవులను ఘనపరచడానికి, వారిపై మీరు అంతగా శ్రద్ధ చూపించడానికి,

  4. ప్రతి ఉదయం వారిని దర్శించడానికి, అనుక్షణం వారిని పరీక్షించడానికి వారెంతటివారు?

  5. “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?

  6. నేను నిర్దోషినైనప్పటికి ఆయనకు బదులు చెప్పలేను. కరుణించమని మాత్రమే నా న్యాయమూర్తిని వేడుకుంటాను.

  7. “నేను అయోగ్యుడను, మీకెలా జవాబు చెప్పగలను? నా చేతితో నా నోరు మూసుకుంటాను.

  8. ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”

  9. “మీరు అన్నారు, ‘నేను మాట్లాడతాను, నీవు విను; నేను ప్రశ్నిస్తాను, నీవు నాకు జవాబివ్వాలి.’

  10. గతంలో నా చెవులు మీ గురించి విన్నాయి కాని ఇప్పుడైతే నా కళ్లు మిమ్మల్ని చూశాయి.

  11. కాబట్టి నన్ను నేను అసహ్యించుకుని దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నాను.”

  12. మీ చేతి పనియైన మీ ఆకాశాలను, మీరు వాటి వాటి స్థానాల్లో ఉంచిన చంద్ర నక్షత్రాలను నేను చూసినప్పుడు,

  13. మీరు మానవులను జ్ఞాపకం చేసుకోడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?

  14. దావీదు యాత్రకీర్తన. యెహోవా, నా హృదయం గర్వం కలిగిలేదు, నా కళ్లు అహంకారం కలిగిలేవు. నేను గ్రహించలేని గొప్ప విషయాలను నాకు అసాధ్యమైన విషయాలను నేను పట్టించుకోను.

  15. పాలు విడచిన బిడ్డ సంతృప్తిగా ఉన్నట్లు, అవును, పాలు విడచిన బిడ్డ తన తల్లి ఒడిలో సంతృప్తిగా ఉన్నట్లు, నన్ను నేను నెమ్మదిపరచుకొని ప్రశాంతంగా ఉన్నాను.

  16. యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు?

  17. నరులు కేవలం ఊపిరిలాంటివారు; దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి.

  18. నిజంగా నేను క్రూరమైనవాన్ని, మనుష్యుని కాదు; మనుష్యులకు ఉండే ఇంగిత జ్ఞానం నాకు లేదు.

  19. నేను జ్ఞానాన్ని అభ్యాసం చేయలేదు, పరిశుద్ధుని గురించిన తెలివి నాకు లేదు.

  20. యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.

  21. యెహోవా, నన్ను క్రమశిక్షణలో పెట్టు, కానీ న్యాయమైన కొలతతో మాత్రమే మీ కోపంలో కాదు, లేకపోతే మీరు నన్ను పూర్తిగా నాశనం చేస్తారు.

  22. “అప్పుడు ఆ నీతిమంతులు, ‘ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలితో ఉన్నావని చూసి ఆహారం పెట్టాం? ఎప్పుడు దప్పికతో ఉన్నావని చూసి నీ దాహం తీర్చాము?

  23. ఎప్పుడు నీవు పరదేశివని చూసి నిన్ను మా ఇంట్లోకి చేర్చుకున్నాము? ఎప్పుడు బట్టలు లేకపోవడం చూసి బట్టలు ఇచ్చాము?

  24. ఎప్పుడు నిన్ను రోగిగా చూసి లేదా చెరసాలలో చూసి పరామర్శించాము?’ అని ఆయనను అడుగుతారు.

  25. “అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.