Skip to content

Dedication గురించి బైబిల్ వచనాలు

213 వచనాలు · 28 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎందుకంటే ప్రభువైన యెహోవా, మీరు మా పూర్వికులను ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు మీ సేవకుడైన మోషే ద్వారా ప్రకటించినట్లుగానే, లోకంలోని జనాంగాలన్నిటి నుండి వారిని మీ సొంత వారసత్వంగా చేసుకున్నారు కదా.”

  2. సొలొమోను యెహోవాకు ఈ ప్రార్థనలు, విన్నపాలు అన్ని చేసిన తర్వాత, యెహోవా బలిపీఠం ముందు మోకరించి ఆకాశం వైపు చేతులు చాచిన ఆ స్థలం నుండి లేచాడు.

  3. అతడు నిలబడి ఇశ్రాయేలు సమాజమంతటిని దీవిస్తూ, స్వరమెత్తి ఇలా అన్నాడు:

  4. “యెహోవాకు స్తుతి కలుగును గాక! తన వాగ్దానం ప్రకారం ఆయన తన ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలుగజేశారు. ఆయన తన సేవకుడైన మోషేకు ఇచ్చిన మంచి వాగ్దానాలన్నిటిలో ఒక్కటి కూడా తప్పలేదు.

  5. మన పూర్వికులతో ఉన్నట్లు మన దేవుడైన యెహోవా మనతో ఉండును గాక; ఆయన మనలను విడువక త్రోసివేయక ఉండును గాక.

  6. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన మన పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటించడానికి, ఆయన వైపు మన హృదయాలను త్రిప్పాలి.

  7. ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి!

  8. అప్పుడు ప్రపంచంలోని అన్ని జనాంగాలు యెహోవాయే దేవుడని, వేరెవరు లేరని తెలుసుకుంటారు.

  9. మీ హృదయాలు ఇప్పుడున్నట్లుగా దేవుడైన యెహోవాకు పూర్తిగా సమర్పించుకొని, ఆయన శాసనాలు ప్రకారం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉండును గాక.”

  10. తర్వాత రాజు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు.

  11. సొలొమోను యెహోవాకు సమాధానబలులుగా 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులందరు యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించారు.

  12. ఆ సమయంలో ఏడు రోజులు సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చారు.

  13. ఎనిమిదవ రోజున వారు సమావేశాన్ని నిర్వహించారు, ఎందుకంటే ఏడు రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠించి మరో ఏడు రోజులు పండుగ జరుపుకున్నారు.

  14. ఏడవ నెల ఇరవై మూడవ రోజున, అతడు ప్రజలను తమ ఇళ్ళకు పంపివేశాడు. యెహోవా దావీదుకు, సొలొమోనుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో వెళ్లారు.

  15. అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు చెర నుండి విడుదలై వచ్చిన వారందరు కలిసి ఆనందంతో మందిరాన్ని ప్రతిష్ఠించారు.

  16. దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి వారు ఆ రోజున వంద ఎడ్లు, రెండువందల పొట్టేళ్లు, నాలుగువందల గొర్రెపిల్లలు, ఇశ్రాయేలీయులందరి కోసం పాపపరిహారబలిగా ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను బలి అర్పించారు.

  17. యెరూషలేము గోడ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కృతజ్ఞతా స్తుతి గీతాలతో తాళాలు, వీణలు సితారలు వాయిస్తూ సంతోషంగా చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుండి లేవీయులను యెరూషలేముకు తీసుకువచ్చే పని మొదలుపెట్టారు.

  18. సంగీతకారులను యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, నెటోపాతీయుల గ్రామాల నుండి తీసుకువచ్చారు.

  19. యెరూషలేము చుట్టూ సంగీతకారులు తమ కోసం గ్రామాలు నిర్మించుకున్నారు కాబట్టి బేత్-గిల్గాలు నుండి, గెబా అజ్మావెతు ప్రాంతాల నుండి వచ్చారు.

  20. యాజకులు, లేవీయులు తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత ప్రజలను, గుమ్మాలను, గోడను పవిత్రపరిచారు.

  21. నేను యూదా నాయకులను గోడ మీదికి తీసుకువచ్చాను. కృతజ్ఞతలు చెల్లించడానికి రెండు పెద్ద గాయక బృందాలను నియమించాను. వాటిలో ఒక బృందం గోడ మీద కుడి వైపుగా పెంట ద్వారం వైపు నడిచారు.

  22. హోషయా, యూదా నాయకుల్లో సగం మంది వారితో పాటు వెళ్లారు.

  23. వారితో అజర్యా, ఎజ్రా, మెషుల్లాము,

  24. యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనేవారు వెళ్లారు.

  25. అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా,