Skip to content

Continence గురించి బైబిల్ వచనాలు: General references

23 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

  1. “ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా.

  2. అయితే నేను మీతో చెప్పేదేంటంటే, ఒక వ్యక్తి స్త్రీని కామంతో చూస్తేనే అతడు తన మనస్సులో ఆమెతో వ్యభిచారం చేసినట్టు.

  3. మీరు వ్రాసిన విషయాల గురించి: “స్త్రీతో లైంగిక సంబంధం లేకపోవడం పురుషునికి మంచిది.”

  4. అయితే లైంగిక దుర్నీతి జరుగుతుంది కాబట్టి ప్రతి పురుషుడు తన సొంత భార్యతోనే, ప్రతి స్త్రీ తన సొంత భర్తతోనే లైంగిక సంబంధం కలిగి ఉండాలి.

  5. భర్త తన భార్య పట్ల వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి, అదే విధంగా భార్య తన భర్తకు వైవాహిక బాధ్యతను నెరవేర్చాలి.

  6. భార్య శరీరం మీద ఆమె భర్తకే గాని ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద భార్యకే గాని అతనికి అధికారం లేదు.

  7. మీరు ఇద్దరు వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరస్పర అంగీకారంతోనే తప్ప ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండకండి. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేనప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండ మీరు తిరిగి కలుసుకోండి.

  8. ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు.

  9. మీరందరు నాలా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, మీలో ప్రతి ఒక్కరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరాన్ని ఇచ్చారు; ఒకరికి ఒక వరం, ఇంకొకరికి ఇంకొక వరాన్ని ఇచ్చారు.

  10. ఇప్పుడు నేను పెళ్ళికానివారితో, విధవరాండ్రతో చెప్పేది ఏంటంటే: నాలా వారు కూడ పెళ్ళి చేసుకోకుండా ఉండడం మంచిది.

  11. అయితే వారు తమను తాము అదుపు చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకోవాలి. కామంతో రగిలిపోవడం కంటే పెళ్ళి చేసుకోవడం మేలు.

  12. కన్యల గురించి ప్రభువు నుండి నాకు ఆజ్ఞ లేదు గాని, ప్రభువు కృప చేత నమ్మకమైన వానిగా నేను ఒక ఆలోచన చెప్తున్నాను.

  13. ఇప్పటి క్లిష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్ధితిలోనే ఉండడం మంచిదని నేను భావిస్తున్నాను.

  14. మీరు ఒక స్త్రీకి ప్రమాణం చేశారా? దాని నుండి విడుదల కోరవద్దు. మీరు అలాంటి ప్రమాణం నుండి విడుదల పొందారా? భార్య కోసం వెదకవద్దు.

  15. అయితే, మీరు పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు; కన్య పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదు. అయితే పెళ్ళి చేసుకున్న వారికి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, అవి మీకు కలుగకూడదని నేను కోరుతున్నాను.

  16. సహోదరీ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, సమయం తక్కువగా ఉన్నది. కాబట్టి ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్లు జీవించండి.

  17. ఎవరైనా తనకు నిశ్చయమైన కన్య పట్ల గౌరవంగా నడుచుకోవడం లేదని బాధపడితే, ఒకవేళ ఆమె వయస్సు పెరిగిపోవడం వలన పెళ్ళి చేయాలని భావిస్తే, అతడు తాను కోరుకున్నట్లే చేయాలి. అతడు పాపం చేయడం లేదు. వారు పెళ్ళి చేసుకోవాలి.

  18. అయితే ఎవడైనా కన్యను పెళ్ళి చేసుకోకూడదని నిర్ణయించుకొని, దానికి తగిన మనోబలం కలిగి ఉండి తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడైతే అతడు చేసేది కూడా మంచిదే.

  19. కాబట్టి ఒకడు కన్యను పెళ్ళి చేసుకున్నా మంచిదే, చేసుకోకపోతే ఇంకా మంచిది.

  20. వృద్ధుని కఠినంగా గద్దించకుండా, అతన్ని నీ తండ్రిగా భావించి ప్రోత్సహించు. నీ కన్నా చిన్నవారిని నీ సోదరులుగా,

  21. సంపూర్ణమైన పవిత్రతతో నీ కన్నా పెద్దవారైన స్త్రీలను తల్లులుగా, నీ కన్నా చిన్నవారైన స్త్రీలను చెల్లెళ్ళుగా చూడు.

  22. వీరు ఏ స్త్రీతో తమను అపవిత్రం చేసుకోకుండా పవిత్రంగా జీవించారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు దాన్ని అనుసరించారు. వారు మానవుల నుండి దేవునికి, గొర్రెపిల్లకు తొలిఫలంగా అర్పించడానికి కొనబడ్డవారు.

  23. వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు.