కంటెంట్‌కు వెళ్లండి

Civil Service గురించి బైబిల్ వచనాలు: Appointment in, on account of merit

55 వచనాలు · 4 కోణాలు

"Civil Service" కోసం వెతకండి

Appointment in, on account of merit గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోసేపు ఈజిప్టుకు కొనిపోబడ్డాడు. ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరు అనే ఈజిప్టువాడు యోసేపును తీసుకెళ్లిన ఇష్మాయేలీయుల దగ్గర అతన్ని కొన్నాడు.

  2. యెహోవా యోసేపుతో ఉన్నారు కాబట్టి అతడు వర్ధిల్లాడు, తన ఈజిప్టు యజమాని ఇంట్లో ఉన్నాడు.

  3. యెహోవా అతనితో ఉన్నారని, అతడు చేసే ప్రతి పనిలో యెహోవా విజయం ఇచ్చారని అతని యజమాని చూసినప్పుడు

  4. యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు, అతనికి వ్యక్తిగత పరిచారకుడయ్యాడు. పోతీఫరు యోసేపును అతని ఇంటికి అధికారిగా నియమించి తనకున్న సమస్తాన్ని అతని పర్యవేక్షణలో పెట్టాడు.

  5. తన ఇంటికి, తన సమస్తానికి యోసేపును అధికారిగా నియమించినప్పటి నుండి, యెహోవా ఈజిప్టు యజమాని ఇంటిని ఆశీర్వదించారు. ఇంట్లోనూ, పొలంలోనూ పోతీఫరుకు ఉన్న సమస్తం మీద యెహోవా ఆశీర్వాదం ఉంది.

  6. కాబట్టి పోతీఫరు సమస్తాన్ని యోసేపు పర్యవేక్షణలో పెట్టాడు; యోసేపు అధికారిగా ఉన్నందుకు తన భోజనం తప్ప మరి దేని గురించి అతడు పట్టించుకోలేదు. యోసేపు మంచి రూపం కలిగినవాడు, అందగాడు.

  7. కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు.

  8. అప్పుడు ఫరో యోసేపుతో, “దేవుడు నీకు ఇదంతా తెలియజేశారు కాబట్టి, నీలా వివేచన జ్ఞానం కలిగిన వారెవరూ లేరు.

  9. నా రాజభవన అధికారిగా నీవు ఉంటావు, నా ప్రజలంతా నీ ఆదేశాలకు లోబడతారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీ పైవాడిగా ఉంటాను” అని అన్నాడు.

  10. కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు.

  11. ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.

  12. తన రెండవ రథంలో అతన్ని కూర్చోబెట్టాడు, అప్పుడు ప్రజలు, “నమస్కారం చేయండి!” అని అంటూ అతని ముందు కేకలు వేశారు. ఈ విధంగా అతడు యోసేపును దేశమంతటిమీద అధికారిగా చేశాడు.

  13. అప్పుడు ఫరో యోసేపుతో, “నేను ఫరోను, కానీ నీ అనుమతి లేకుండా ఈజిప్టు అంతటిలో ఎవరు కూడా తన చేయి కానీ కాలు కానీ ఎత్తరు” అని అన్నాడు.

  14. ఆ రాత్రి రాజుకు నిద్రపట్టలేదు; కాబట్టి తన పాలన గురించి ఉన్న రాజ్య చరిత్ర గ్రంథం తెప్పించి, చదివించుకున్నాడు.

  15. అందులో రాజభవన ద్వారపాలకులైన బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజ్యాధికారులు అహష్వేరోషు రాజును చంపడానికి కుట్రపన్నిన సంగతిని మొర్దెకై తెలియజేసినట్లు వ్రాయబడి ఉంది.

  16. రాజు, “దీని కోసం మొర్దెకై పొందుకున్న ఘనత, గుర్తింపు ఏంటి?” అని అడిగాడు. అందుకు అతని సేవకులు, “అతని కోసం ఏమి చేయలేదు” అన్నారు.

  17. రాజు, “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. అప్పుడే హామాను, తాను సిద్ధపరచిన ఉరికంబం మీద మొర్దెకైను ఉరితీయడం గురించి రాజుతో మాట్లాడడానికి బయట ఆవరణంలోకి ప్రవేశించాడు.

  18. రాజు సేవకులు, “హామాను ఆవరణంలో నిలబడ్డాడు” అని చెప్పారు. వెంటనే, “అతన్ని లోనికి తీసుకురండి” అని రాజు ఆదేశించాడు.

  19. హామాను లోపలికి వచ్చినప్పుడు, “రాజు ఒకరిని సన్మానం చేయాలని ఇష్టపడితే ఆ మనిషికి ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను, “నన్ను కాకుండా రాజు ఇంకెవరిని సన్మానిస్తాడు?” అని తనలో తాను అనుకున్నాడు.

  20. కాబట్టి హామాను రాజుతో, “రాజు సన్మానించాలని అనుకునే వ్యక్తి కోసం,

  21. రాజు ధరించుకునే రాజవస్ర్తాలను, రాజు స్వారీ చేసే గుర్రాన్ని, రాజు తలమీద పెట్టుకునే రాజకిరీటాన్ని తీసుకురావాలి.

  22. తర్వాత ఆ రాజవస్త్రాన్ని ఆ గుర్రాన్ని రాజు యొక్క అత్యంత ఘనులైన ఓ అధిపతికి అప్పగించాలి. రాజు సన్మానించాలని అనుకున్న ఆ వ్యక్తికి ఆ రాజ వస్త్రం వేయించి ఆ గుర్రం మీద నగర వీధుల్లో త్రిప్పుతూ, ‘రాజు ఒక వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఆ వ్యక్తికి ఇలా చేయబడుతుంది!’ అని అంటూ ఆ వ్యక్తి ఎదుట చాటాలి” అని అన్నాడు.

  23. అందుకు రాజు, “త్వరగా వెళ్లు, నీవు చెప్పినట్టే రాజ వస్త్రం, గుర్రం తీసుకుని, రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉండే యూదుడైన మొర్దెకైకి చేయి. నీవు చెప్పింది ఏదైన మానకు” అని హామానుకు ఆజ్ఞాపించాడు.

  24. కాబట్టి హామాను రాజవస్త్రాలు, గుర్రం తీసుకువచ్చి మొర్దెకైకు ఆ వస్త్రాలు ధరింపజేసి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి నగర వీధుల్లో వెళ్తూ, “రాజు ఓ వ్యక్తిని సన్మానించాలని ఇష్టపడితే ఇలా అతనికి చేయబడుతుంది!” అని అంటూ ఊరేగింపు చేశాడు.

  25. ఈ నలుగురు యువకులకు దేవుడు అన్ని రకాల సాహిత్యంలో, విద్యలో, తెలివిని, వివేకాన్ని ఇచ్చారు. అంతేకాక, దానియేలు దర్శనాలు, రకరకాల కలల భావాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.