కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మత్తయి 22:23సుమారు క్రీ.శ. 33

    పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు అదే రోజు ఆయన దగ్గరకు ఒక ప్రశ్నతో వచ్చారు.

  2. మత్తయి 22:24సుమారు క్రీ.శ. 33

    “బోధకుడా, ఒకడు సంతానం లేకుండా చనిపోతే, వాని సోదరుడు ఆ విధవరాలిని పెళ్ళి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలని మోషే చెప్పాడు.

  3. మత్తయి 22:25సుమారు క్రీ.శ. 33

    అలా మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. కాబట్టి అతని తమ్ముడు అతని విధవను చేసుకున్నాడు.

  4. మత్తయి 22:26సుమారు క్రీ.శ. 33

    అలాగే రెండవవాడు, మూడవవాడు, ఏడవ వాని వరకు అలాగే జరిగింది.

  5. మత్తయి 22:27సుమారు క్రీ.శ. 33

    చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.

  6. మత్తయి 22:28సుమారు క్రీ.శ. 33

    ఆమెను వారందరు పెళ్ళి చేసుకున్నారు కాబట్టి పునరుత్థానంలో ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” అని ఆయనను అడిగారు.

  7. మత్తయి 22:29సుమారు క్రీ.శ. 33

    అందుకు యేసు, “మీకు వాక్యం కాని దేవుని శక్తిని కాని తెలియదు కాబట్టి మీరు పొరపాటు పడుతున్నారు.

  8. మత్తయి 22:30సుమారు క్రీ.శ. 33

    పునరుత్థానంలో ప్రజలు పెళ్ళి చేసుకోరు, పెళ్ళికివ్వబడరు. వారు పరలోకంలో దూతల్లా ఉంటారు.

  9. మత్తయి 22:31సుమారు క్రీ.శ. 33

    మృతుల పునరుత్థానం గురించి, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు మీతో చెప్పిన మాటను మీరు చదువలేదా? ఆయన మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుడు” అని చెప్పారు.

  10. మత్తయి 22:32సుమారు క్రీ.శ. 33

    I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob? God is not the God of the dead, but of the living.

  11. మత్తయి 22:33సుమారు క్రీ.శ. 33

    జనులు ఈ మాటను విన్నప్పుడు, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.

  12. మత్తయి 22:34సుమారు క్రీ.శ. 33

    యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని, పరిసయ్యులు అక్కడికి చేరుకున్నారు.

  13. మత్తయి 22:35సుమారు క్రీ.శ. 33

    వారిలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు, యేసును పరీక్షిస్తూ,

  14. మత్తయి 22:36సుమారు క్రీ.శ. 33

    “బోధకుడా, ధర్మశాస్త్రంలో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు.

  15. మత్తయి 22:37సుమారు క్రీ.శ. 33

    అందుకు యేసు, “ ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో మీ పూర్ణమనస్సుతో మీ ప్రభువైన దేవుని ప్రేమించాలి.’

  16. మత్తయి 22:38సుమారు క్రీ.శ. 33

    ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ.

  17. మత్తయి 22:39సుమారు క్రీ.శ. 33

    రెండవ ఆజ్ఞ దాని వంటిదే: ‘మీకులా మీ పొరుగువారిని ప్రేమించాలి.’

  18. మత్తయి 22:40సుమారు క్రీ.శ. 33

    ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తల మాటలకు ఆధారంగా ఉన్నాయి” అని అతనితో చెప్పారు.

  19. మత్తయి 22:41సుమారు క్రీ.శ. 33

    పరిసయ్యులు ఒకచోట కూడి ఉన్నప్పుడు యేసు వారిని ఈ విధంగా అడిగారు,

  20. మత్తయి 22:42సుమారు క్రీ.శ. 33

    “క్రీస్తును గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అందుకు వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు.

  21. మత్తయి 22:43సుమారు క్రీ.శ. 33

    అందుకాయన, “అలాగైతే దావీదు, ఆత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనను ‘ప్రభువు’ అని ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు ఇలా అన్నాడు,

  22. మత్తయి 22:44సుమారు క్రీ.శ. 33

    “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు “నీవు నా కుడి ప్రక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో అన్నారు.” ’

  23. మత్తయి 22:45సుమారు క్రీ.శ. 33

    దావీదే ఆయనను ‘ప్రభువు’ అని పిలిస్తే, ఆయన అతనికి కుమారుడెలా అవుతాడు?” అని అడిగారు.

  24. మత్తయి 22:46సుమారు క్రీ.శ. 33

    ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పలేకపోయారు, ఆ రోజు నుండి ఎవరు కూడా ఆయనను ప్రశ్నలు అడగడానికి ధైర్యం చేయలేదు.

  25. మత్తయి 23:1సుమారు క్రీ.శ. 33

    అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో,