circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- యోహాను 7:42సుమారు క్రీ.శ. 33
క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి దావీదు నివసించిన బేత్లెహేమనే ఊరి నుండి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడలేదా?” అని చెప్పుకుంటున్నారు.
- యోహాను 7:43సుమారు క్రీ.శ. 33
ఈ విధంగా క్రీస్తును గురించి ప్రజల్లో విభేదాలు ఏర్పడ్డాయి.
- యోహాను 7:44సుమారు క్రీ.శ. 33
కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు, కాని ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు.
- యోహాను 7:45సుమారు క్రీ.శ. 33
చివరికి దేవాలయ సంరక్షకులు తిరిగి ముఖ్య యాజకులు పరిసయ్యుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు, “అతన్ని మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు.
- యోహాను 7:46సుమారు క్రీ.శ. 33
ఆ సంరక్షకులు, “ఆయన మాట్లాడే విధంగా ఇంతకుముందు ఎవ్వరూ మాట్లాడలేదు” అని చెప్పారు.
- యోహాను 7:47సుమారు క్రీ.శ. 33
పరిసయ్యులు, “అంటే మిమ్మల్ని కూడా అతడు మోసగించాడా? అని అన్నారు.
- యోహాను 7:48సుమారు క్రీ.శ. 33
అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనను నమ్మారా?
- యోహాను 7:49సుమారు క్రీ.శ. 33
లేదు! ధర్మశాస్త్రం గురించి ఏమి తెలియని ఈ గుంపు నమ్ముతున్నారు, వారి మీద శాపం ఉంది” అన్నారు.
- యోహాను 7:50సుమారు క్రీ.శ. 33
అంతకుముందు యేసు దగ్గరకు వెళ్లిన వాడును స్వయంగా వారిలో ఒక సభ్యుడునైన నీకొదేము,
- యోహాను 7:51సుమారు క్రీ.శ. 33
“ఒకరు చెప్పేది వినకుండా, వారు ఏమి చేస్తూ ఉన్నాడో కనుక్కోకుండా మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చుతుందా?” అని అడిగాడు.
- యోహాను 7:52సుమారు క్రీ.శ. 33
అందుకు వారు, “నీవు కూడ గలిలయకు చెందినవాడివా? ఇదిగో, గలిలయ నుండి ఏ ప్రవక్త రాడు కదా!” అన్నారు.
- యోహాను 7:53సుమారు క్రీ.శ. 33
తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
- యోహాను 8:1సుమారు క్రీ.శ. 33
అయితే యేసు ఒలీవల కొండకు వెళ్లారు.
- యోహాను 8:2సుమారు క్రీ.శ. 33
ఉదయం పెందలకడనే యేసు మళ్ళీ దేవాలయ ఆవరణంలో కనబడినప్పుడు ప్రజలందరు ఆయన చుట్టూ చేరారు. ఆయన వారికి బోధించడానికి కూర్చున్నారు.
- యోహాను 8:3సుమారు క్రీ.శ. 33
అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను గుంపు ముందు నిలబెట్టి,
- యోహాను 8:4సుమారు క్రీ.శ. 33
వారు యేసుతో, “బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
- యోహాను 8:5సుమారు క్రీ.శ. 33
అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మనకు ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు. ఇప్పుడు నీవేమంటావు?” అని అడిగారు.
- యోహాను 8:6సుమారు క్రీ.శ. 33
యేసు మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు. కానీ యేసు క్రిందికి వంగి తన వ్రేలితో నేలపై వ్రాస్తూ ఉన్నారు.
- యోహాను 8:7సుమారు క్రీ.శ. 33
వారు ఆపకుండా ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, “మీలో పాపం లేనివాడు ఆమెపై మొదటి రాయి వేయండి” అని చెప్పి,
- యోహాను 8:8సుమారు క్రీ.శ. 33
మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ ఉన్నారు.
- యోహాను 8:9సుమారు క్రీ.శ. 33
వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది.
- యోహాను 8:10సుమారు క్రీ.శ. 33
యేసు తన తలయెత్తి, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు.
- యోహాను 8:11సుమారు క్రీ.శ. 33
ఆమె, “అయ్యా ఎవరూ లేరు” అన్నది. అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటినుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు.
- యోహాను 8:12సుమారు క్రీ.శ. 33
యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.
- యోహాను 8:13సుమారు క్రీ.శ. 33
అందుకు పరిసయ్యులు, “నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు; కాబట్టి నీ సాక్ష్యానికి విలువలేదు” అన్నారు.