కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోహాను 6:63సుమారు క్రీ.శ. 32

    ఆత్మ జీవాన్ని ఇస్తుంది; శరీరం వలన ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మతో జీవంతో నిండి ఉన్నాయి.

  2. యోహాను 6:64సుమారు క్రీ.శ. 32

    అయినా మీలో కొందరు నమ్మడం లేదు” అన్నారు. ఎందుకంటే వారిలో ఎవరు మొదటి నుండి నమ్మడం లేదో, ఎవరు తనను అప్పగిస్తారో యేసుకు తెలుసు.

  3. యోహాను 6:65సుమారు క్రీ.శ. 32

    ఆయన వారితో, “ఈ కారణంగానే తండ్రి రానిస్తేనే తప్ప మరి ఎవరు నా దగ్గరకు రాలేరని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.

  4. యోహాను 6:66సుమారు క్రీ.శ. 32

    అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనక్కి వెళ్లిపోయి మరి ఎన్నడు ఆయనను వెంబడించలేదు.

  5. యోహాను 6:67సుమారు క్రీ.శ. 32

    యేసు పన్నెండుమందిని, “మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా?” అని అడిగారు.

  6. యోహాను 6:68సుమారు క్రీ.శ. 32

    అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి.

  7. యోహాను 6:69సుమారు క్రీ.శ. 32

    నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మి తెలుసుకున్నాము” అని చెప్పాడు.

  8. యోహాను 6:70సుమారు క్రీ.శ. 32

    అప్పుడు యేసు, “మీ పన్నెండుమందిని నేను ఎన్నుకోలేదా? అయినా మీలో ఒకడు దుష్టుడు” అని వారితో చెప్పారు.

  9. యోహాను 6:71సుమారు క్రీ.శ. 32

    పన్నెండుమందిలో ఒకనిగా ఉన్నా తర్వాత ఆయనను అప్పగించబోయే సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా గురించి ఆయన చెప్పారు.

  10. యోహాను 7:1సుమారు క్రీ.శ. 33

    ఆ తర్వాత, యేసు గలిలయల ప్రాంతంలోనే తిరుగుతున్నారు. యూదా నాయకులు ఆయనను చంపాలని ఎదురు చూస్తున్నారని యేసు యూదయ ప్రాంతాలకు వెళ్లకూడదనుకున్నారు.

  11. యోహాను 7:2సుమారు క్రీ.శ. 33

    కానీ యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడినప్పుడు,

  12. యోహాను 7:3సుమారు క్రీ.శ. 33

    యేసుని సహోదరులు ఆయనతో, “గలిలయల వదిలి యూదయకు వెళ్లు. అప్పుడు అక్కడ ఉన్న నీ శిష్యులు నీవు చేసిన కార్యాలు చూస్తారు.

  13. యోహాను 7:4సుమారు క్రీ.శ. 33

    అందరిలో ప్రసిద్ధి పొందాలని కోరుకునే వారెవరు రహస్యంగా కార్యాలను చేయరు. నీవు ఈ కార్యాలను చేస్తున్నావు, లోకానికి నీ గురించి తెలిసేలా చేయి” అన్నారు.

  14. యోహాను 7:5సుమారు క్రీ.శ. 33

    ఎందుకంటే ఆయన సహోదరులు కూడా ఆయనను నమ్మలేదు.

  15. యోహాను 7:6సుమారు క్రీ.శ. 33

    అందుకు యేసు వారితో, “నా సమయం ఇంకా రాలేదు; కానీ మీ సమయం ఎప్పుడైనా ఉంటుంది.

  16. యోహాను 7:7సుమారు క్రీ.శ. 33

    ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నేను దాని పనులు చెడ్డవని సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది.

  17. యోహాను 7:8సుమారు క్రీ.శ. 33

    మీరు పండుగకు వెళ్లండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నేను ఈ పండుగకు ఇప్పుడే రాను” అని చెప్పారు.

  18. యోహాను 7:9సుమారు క్రీ.శ. 33

    ఇది చెప్పిన తర్వాత ఆయన గలిలయలో ఉన్నారు.

  19. యోహాను 7:10సుమారు క్రీ.శ. 33

    అయితే తన సహోదరులు పండుగకు వెళ్లిన తర్వాత, బహిరంగంగా కాకుండా రహస్యంగా ఆయన కూడా వెళ్లారు.

  20. యోహాను 7:11సుమారు క్రీ.శ. 33

    పండుగలో యూదా నాయకులు యేసుని వెదకుతూ, “ఆయన ఎక్కడ?” అని అడుగుతున్నారు.

  21. యోహాను 7:12సుమారు క్రీ.శ. 33

    ఆ జనసమూహంలో ఆయన గురించి గుసగుసలు మొదలయ్యాయి. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు.

  22. యోహాను 7:13సుమారు క్రీ.శ. 33

    అయితే యూదా నాయకులకు భయపడి ఎవరు ఆయన గురించి బహిరంగంగా ఏమి మాట్లాడలేదు.

  23. యోహాను 7:14సుమారు క్రీ.శ. 33

    పండుగ ఉత్సవాలు సగం రోజులు పూర్తియైన తర్వాత యేసు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు.

  24. యోహాను 7:15సుమారు క్రీ.శ. 33

    అక్కడ ఉన్న యూదులు ఆశ్చర్యపడి, “చదువుకోని వానికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది?” అని అడిగారు.

  25. యోహాను 7:16సుమారు క్రీ.శ. 33

    అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది.