కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోహాను 6:38సుమారు క్రీ.శ. 32

    ఎందుకంటే నేను నాకిష్టమైనది చేయడానికి పరలోకం నుండి దిగిరాలేదు కానీ నన్ను పంపినవానికి ఇష్టమైనది చేయడానికే వచ్చాను.

  2. యోహాను 6:39సుమారు క్రీ.శ. 32

    ఆయన నాకిచ్చిన వారిలో ఎవరినీ పోగొట్టుకోకుండా, చివరి రోజున వారిని జీవంతో లేపడం నన్ను పంపినవాని చిత్తమై ఉంది.

  3. యోహాను 6:40సుమారు క్రీ.శ. 32

    కుమారుని చూసి ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందాలనేది నా తండ్రి చిత్తమై ఉంది. వారిని చివరి రోజున జీవంతో నేను లేపుతాను.”

  4. యోహాను 6:41సుమారు క్రీ.శ. 32

    “పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే” అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనపై సణుగుకోవడం మొదలుపెట్టారు.

  5. యోహాను 6:42సుమారు క్రీ.శ. 32

    వారు, “ఈ యేసు యోసేపు కుమారుడు కాడా? ఇతని తల్లిదండ్రులు మనకు తెలియదా? ‘నేను పరలోకం నుండి దిగి వచ్చాను’ అని ఎలా చెప్తున్నాడు?” అని చెప్పుకున్నారు.

  6. యోహాను 6:43సుమారు క్రీ.శ. 32

    యేసు, “మీలో మీరు సణుగుకోవడం ఆపండి” అన్నారు.

  7. యోహాను 6:44సుమారు క్రీ.శ. 32

    ఇంకా మాట్లాడుతూ, “నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరూ నా దగ్గరకు రాలేరు, చివరి రోజున నేను వారిని జీవంతో లేపుతాను.

  8. యోహాను 6:45సుమారు క్రీ.శ. 32

    ‘దేవుడు వారందరికి బోధిస్తారు’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు.

  9. యోహాను 6:46సుమారు క్రీ.శ. 32

    దేవుని నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవరు తండ్రిని చూడలేదు; ఆయన మాత్రమే తండ్రిని చూశారు

  10. యోహాను 6:47సుమారు క్రీ.శ. 32

    నమ్మినవారే నిత్యజీవాన్ని కలిగి ఉంటాడని నేను మీతో చెప్పేది నిజము.

  11. యోహాను 6:48సుమారు క్రీ.శ. 32

    జీవాహారం నేనే.

  12. యోహాను 6:49సుమారు క్రీ.శ. 32

    మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు.

  13. యోహాను 6:50సుమారు క్రీ.శ. 32

    అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు.

  14. యోహాను 6:51సుమారు క్రీ.శ. 32

    పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.

  15. యోహాను 6:52సుమారు క్రీ.శ. 32

    అందుకని యూదులు తమలో తాము, “ఈయన తన శరీరాన్ని మనం తినడానికి ఎలా ఇవ్వగలడు?” అని తీవ్రంగా వాదించుకోవడం మొదలుపెట్టారు.

  16. యోహాను 6:53సుమారు క్రీ.శ. 32

    అందుకు యేసు వారితో, “నేను మీతో చెప్పేది నిజం, మీరు మనుష్యకుమారుని శరీరాన్ని తిని, ఆయన రక్తాన్ని త్రాగితేనే తప్ప మీలో జీవం ఉండదు.

  17. యోహాను 6:54సుమారు క్రీ.శ. 32

    నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవారు నిత్యజీవం కలిగి ఉంటారు. చివరి రోజున నేను వానిని జీవంతో లేపుతాను.

  18. యోహాను 6:55సుమారు క్రీ.శ. 32

    నా శరీరం నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానీయము.

  19. యోహాను 6:56సుమారు క్రీ.శ. 32

    నా శరీరాన్ని తిని, నా రక్తాన్ని త్రాగినవారు నాలో నిలిచి ఉంటారు, అలాగే నేను వారిలో నిలిచి ఉంటాను.

  20. యోహాను 6:57సుమారు క్రీ.శ. 32

    సజీవుడైన తండ్రి నన్ను పంపినందుకు నేను తండ్రి వలననే జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవారు నా వలన జీవిస్తారు.

  21. యోహాను 6:58సుమారు క్రీ.శ. 32

    పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం ఇదే. మీ పితరులు మన్నాను తిని చనిపోయారు కాని ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు” అని చెప్పారు.

  22. యోహాను 6:59సుమారు క్రీ.శ. 32

    కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తూ యేసు ఈ మాటలను చెప్పారు.

  23. యోహాను 6:60సుమారు క్రీ.శ. 32

    అది విన్న ఆయన శిష్యులలో అనేకమంది, “ఇది కష్టమైన బోధ, ఎవరు దీనిని అంగీకరిస్తారు?” అన్నారు.

  24. యోహాను 6:61సుమారు క్రీ.శ. 32

    యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకుంటున్నారని గ్రహించి వారితో, “ఈ మాటలు మీకు అభ్యంతరకరంగా ఉన్నాయా?

  25. యోహాను 6:62సుమారు క్రీ.శ. 32

    అయితే మనుష్యకుమారుడు తాను ఇంతకుముందు ఉన్న చోటికే ఎక్కిపోవడం చూస్తే ఏమంటారు?