- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446 BC
Sinai & The Law
God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.
ఈ కాలపు వచనాలు
- లేవీయకాండము 17:13సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఇశ్రాయేలీయులలో వారి మధ్య నివసించే విదేశీయులలో ఎవరైనా వేటాడుతూ జంతువును గాని పక్షిని గాని పట్టుకుంటే అతడు దాని రక్తాన్ని పూర్తిగా పారబోసి మట్టితో కప్పెయ్యాలి,
- లేవీయకాండము 17:14సుమారు క్రీ.పూ. 1490
ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం దాని రక్తము. అందుకే, “ప్రతి జీవికి ప్రాణం దాని రక్తం కాబట్టి మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. ఎవరైన దానిని తింటే వారు తొలిగించబడతారు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.
- లేవీయకాండము 17:15సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఎవరైన, స్వదేశీయులు గాని విదేశీయులు గాని చచ్చిన జంతువును గాని మృగాలు చీల్చిన పశువులను గాని తింటే, వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు ఆచారరీత్య అపవిత్రులుగా ఉంటారు; తర్వాత శుద్ధులవుతారు.
- లేవీయకాండము 17:16సుమారు క్రీ.పూ. 1490
వారు తమ బట్టలు ఉతుక్కోకుండా స్నానం చేయకుండ ఉంటే వారి దోషశిక్షకు వారే బాధ్యులవుతారు.’ ”
- లేవీయకాండము 18:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
- లేవీయకాండము 18:2సుమారు క్రీ.పూ. 1490
“నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ‘నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్పు.
- లేవీయకాండము 18:3సుమారు క్రీ.పూ. 1490
మీరు నివసించిన ఈజిప్టులోని వారు చేసినట్లు మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని తీసుకెళ్లే కనాను దేశంలోని వారు చేసినట్టు మీరు చేయకూడదు. వారి ఆచారాలను పాటించకూడదు.
- లేవీయకాండము 18:4సుమారు క్రీ.పూ. 1490
మీరు నా చట్టాలకు లోబడాలి, నా శాసనాలను జాగ్రతగా పాటించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.
- లేవీయకాండము 18:5సుమారు క్రీ.పూ. 1490
నా శాసనాలను చట్టాలను మీరు పాటించండి. ఎవరైతే వాటికి లోబడేవారు వాటి వల్లనే జీవిస్తారు. నేను యెహోవాను.
- లేవీయకాండము 18:6సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.
- లేవీయకాండము 18:7సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకుని నీ తండ్రిని అగౌరపరచవద్దు. ఆమె నీ తల్లి; ఆమెతో లైంగిక సంబంధం ఉండకూడదు.
- లేవీయకాండము 18:8సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ తండ్రిని అగౌరపరుస్తుంది.
- లేవీయకాండము 18:9సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ సోదరితో అనగా అదే ఇంట్లో పుట్టిన లేదా వేరొక చోట పుట్టిన నీ తండ్రి కుమార్తెతో గాని నీ తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
- లేవీయకాండము 18:10సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ కుమారుని కుమార్తెతో గాని నీ కుమార్తె కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నిన్ను అగౌరపరుస్తుంది.
- లేవీయకాండము 18:11సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ తండ్రి భార్యకు పుట్టిన కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ సోదరి.
- లేవీయకాండము 18:12సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తండ్రి రక్తసంబంధి.
- లేవీయకాండము 18:13సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.
- లేవీయకాండము 18:14సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని అతన్ని అగౌరపరచవద్దు; ఆమె నీ పినతల్లి.
- లేవీయకాండము 18:15సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె మీ కుమారుని భార్య; ఆమెతో సంబంధం పెట్టుకోవద్దు.
- లేవీయకాండము 18:16సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; అది నీ సోదరుని అగౌరపరుస్తుంది.
- లేవీయకాండము 18:17సుమారు క్రీ.పూ. 1490
“ ‘ఒక స్త్రీతో, ఆమె కుమార్తెతో కూడా లైంగిక సంబంధం పెట్టుకోవద్దు. ఆమె కుమారుని కుమార్తెతో గాని కుమార్తె యొక్క కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; వారు ఆమె సమీప బంధువులు. అది దుష్టత్వము.
- లేవీయకాండము 18:18సుమారు క్రీ.పూ. 1490
“ ‘నీ భార్య బ్రతికి ఉండగా నీ భార్యను బాధపెట్టడానికి ఆమె సోదరిని భార్యగా చేసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
- లేవీయకాండము 18:19సుమారు క్రీ.పూ. 1490
“ ‘స్త్రీ నెలసరి ద్వార అపవిత్రంగా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోడానికి ఆమె దగ్గరకు వెళ్లవద్దు.
- లేవీయకాండము 18:20సుమారు క్రీ.పూ. 1490
“ ‘పొరుగువాని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని ఆమెతో నిన్ను నీవు అపవిత్రం చేసుకోవద్దు.
- లేవీయకాండము 18:21సుమారు క్రీ.పూ. 1490
“ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.