కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లేవీయకాండము 16:22సుమారు క్రీ.పూ. 1490

    ఆ మేకపోతు ఈ విధంగా వారి పాపాలన్నిటిని భరిస్తూ నిర్జన ప్రదేశాలకు వెళ్తుంది; ఆ వ్యక్తి దానిని అరణ్యంలో వదిలేస్తాడు.

  2. లేవీయకాండము 16:23సుమారు క్రీ.పూ. 1490

    “అప్పుడు అహరోను సమావేశ గుడారంలోకి వెళ్లి అతి పరిశుద్ధస్థలంలోకి వెళ్లేముందు తాను వేసుకున్న సన్నని నార వస్త్రాలను విప్పివేయాలి.

  3. లేవీయకాండము 16:24సుమారు క్రీ.పూ. 1490

    అతడు పరిశుద్ధాలయ ప్రాంగణంలో నీటితో స్నానం చేసి తన సాధారణ బట్టలు వేసుకోవాలి. బయటకు వచ్చి తన కోసం దహనబలిని, ప్రజల పక్షాన మరో దహనబలిని అర్పించి తన కోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.

  4. లేవీయకాండము 16:25సుమారు క్రీ.పూ. 1490

    అతడు పాపపరిహారబలి యొక్క క్రొవ్వును బలిపీఠం మీద కాల్చాలి.

  5. లేవీయకాండము 16:26సుమారు క్రీ.పూ. 1490

    “బలిపశువైన మేకను విడిచిపెట్టి వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసిన తర్వాత అతడు శిబిరంలోకి రావచ్చు.

  6. లేవీయకాండము 16:27సుమారు క్రీ.పూ. 1490

    ప్రాయశ్చిత్తం కోసం అతి పరిశుద్ధస్థలంలోకి వేటి రక్తాన్నైతే తీసుకువచ్చారో ఆ పాపపరిహార బలులైన కోడెదూడను, మేకపోతును శిబిరం బయటకు తీసుకెళ్ళాలి; వాటి చర్మాలను, మాంసాన్ని, పేడను కాల్చివేయాలి.

  7. లేవీయకాండము 16:28సుమారు క్రీ.పూ. 1490

    వాటిని కాల్చే వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి ఆ తర్వాత శిబిరంలోకి రావచ్చు.

  8. లేవీయకాండము 16:29సుమారు క్రీ.పూ. 1490

    “నెల పదవ రోజున మీరంతా ఉపవాసముండాలి. స్వదేశీయులు గాని, మీ ఇంట్లో ఉన్నా విదేశీయులు గాని ఎవరైనా సరే ఈ నియమం అందరికి వర్తిస్తుంది. ఆ రోజున ఎవరూ ఏ పని చేయకూడదు.

  9. లేవీయకాండము 16:30సుమారు క్రీ.పూ. 1490

    ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని పవిత్రపరచడానికి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అప్పుడు యెహోవా ఎదుట, మీ పాపాలన్నిటి నుండి మీరు శుద్ధి చేయబడతారు.

  10. లేవీయకాండము 16:31సుమారు క్రీ.పూ. 1490

    ఆ రోజు మీకు సబ్బాతు విశ్రాంతి దినము. అప్పుడు మీరు ఉపవాసముండాలి; ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  11. లేవీయకాండము 16:32సుమారు క్రీ.పూ. 1490

    ఎవరైతే తన తండ్రి స్థానంలో అభిషేకం పొంది ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడతారో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం జరిగించాలి. అతడు పవిత్రమైన నార వస్త్రాలు ధరించి,

  12. లేవీయకాండము 16:33సుమారు క్రీ.పూ. 1490

    అతి పరిశుద్ధ స్థలానికి, సమావేశ గుడారానికి బలిపీఠానికి, యాజకులకు, సమాజంలోని సభ్యులందరికి ప్రాయశ్చిత్తం చేయాలి.

  13. లేవీయకాండము 16:34సుమారు క్రీ.పూ. 1490

    “ఇది మీ కోసం నిత్య కట్టుబాటుగా ఉంటుంది: ఇశ్రాయేలీయుల పాపాలన్నిటికీ సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేయాలి.” యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే, అంతా జరిగింది.

  14. లేవీయకాండము 17:1సుమారు క్రీ.పూ. 1490

    యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  15. లేవీయకాండము 17:2సుమారు క్రీ.పూ. 1490

    “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది:

  16. లేవీయకాండము 17:3సుమారు క్రీ.పూ. 1490

    ఏ ఇశ్రాయేలీయుడైనా ఒక ఎద్దును, గొర్రెపిల్లను లేదా మేకను యెహోవా ఎదుట సమావేశ గుడార ప్రవేశం ముందు కాక శిబిరంలో గాని శిబిరం బయట గాని బలి ఇస్తే, వారు రక్తపాతం కలిగించిన అపరాధులుగా పరిగణించబడతారు; వారు రక్తం చిందించినవారు కాబట్టి వారు వారి ప్రజల నుండి కొట్టివేయబడాలి.

  17. లేవీయకాండము 17:4సుమారు క్రీ.పూ. 1490

    And bringeth it not unto the door of the tabernacle of the congregation, to offer an offering unto the LORD before the tabernacle of the LORD; blood shall be imputed unto that man; he hath shed blood; and that man shall be cut off from among his people:

  18. లేవీయకాండము 17:5సుమారు క్రీ.పూ. 1490

    కాబట్టి ఇశ్రాయేలీయులు బయట పొలాల్లో అర్పిస్తున్న బలులను ఇకపై యెహోవా ఎదుట సమర్పించాలి. వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవాకు సమాధానబలులుగా అర్పించడానికి యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

  19. లేవీయకాండము 17:6సుమారు క్రీ.పూ. 1490

    సమావేశ గుడార ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు రక్తాన్ని చల్లి, క్రొవ్వును యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.

  20. లేవీయకాండము 17:7సుమారు క్రీ.పూ. 1490

    వారు వ్యభిచారం చేస్తూ వచ్చిన మేక విగ్రహాలకు ఇకపై తమ బలులను అర్పించకూడదు. ఇది వారికి, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.’

  21. లేవీయకాండము 17:8సుమారు క్రీ.పూ. 1490

    “వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా దహనబలిని గాని మరేదైనా బలిని గాని అర్పించాలనుకుని

  22. లేవీయకాండము 17:9సుమారు క్రీ.పూ. 1490

    యెహోవాకు బలి ఇవ్వడానికి సమావేశ గుడార ద్వారం దగ్గరకు దాన్ని తీసుకురాకపోతే వారు ఇశ్రాయేలు ప్రజల నుండి తొలగించబడాలి.

  23. లేవీయకాండము 17:10సుమారు క్రీ.పూ. 1490

    “ ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా రక్తాన్ని తింటే వారికి నేను విరోధంగా ఉంటాను, వారిని తమ ప్రజల నుండి తొలగిస్తాను.

  24. లేవీయకాండము 17:11సుమారు క్రీ.పూ. 1490

    ఎందుకంటే, ఒక జీవికి ప్రాణం రక్తంలో ఉంది, బలిపీఠం మీద మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను దానిని మీకిచ్చాను. ఇది ఒకరి జీవితానికి ప్రాయశ్చిత్తం చేసే రక్తము.

  25. లేవీయకాండము 17:12సుమారు క్రీ.పూ. 1490

    అందుకే, “మీలో గాని, మీ మధ్య ఉన్న విదేశీయులలో గాని ఎవరూ రక్తాన్ని తినకూడదు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.