కంటెంట్‌కు వెళ్లండి

Lebanon

56 verses

33.7500, 35.5900 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Lebanon ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సొలొమోను రాజు చేయించిన పల్లకి అది; లెబానోను మ్రానుతో తయారైన పల్లకి.

  2. నా వధువు, లెబానోను నుండి నాతో రా, లెబానోను నుండి నాతో రా. అమాన పర్వత శిఖరం నుండి, శెనీరు, హెర్మోను శిఖరాల నుంచీ, సింహాల బోనుల నుండి, చిరుత పులులు సంచరించే కొండల నుండి దిగిరా.

  3. నా వధువు! నీ పెదవులు తేనెతెట్టెలా మాధుర్యాన్ని వదులుతున్నాయి; నీ నాలుక క్రింద పాలు తేనె ఉన్నాయి. నీ వస్త్ర సువాసన లెబానోను సువాసనగా ఉంది.

  4. నీవు ఉద్యానవనంలోని జలాశయానివి, లెబానోను నుండి దిగువకు ప్రవహించే, నీటి ఊటలు కల బావివి.

  5. ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపిన పాలరాతి స్తంభాలు. ఆయన రూపం లెబానోనులా, దాని దేవదారు వృక్షాలలా ఉంది.

  6. నీ మెడ దంతపు గోపురం లాంటిది. మీ కళ్లు బాత్-రబ్బీం ద్వారం దగ్గర ఉన్న హెష్బోను కొలనులాంటివి. మీ ముక్కు దమస్కు వైపు చూస్తున్న లెబానోను గోపురం లాంటిది.

  7. ఎందుకంటే ఎత్తైన పొడవైన లెబానోను దేవదారు చెట్లన్నిటికి, బాషాను సింధూర వృక్షాలన్నిటికి,

  8. ఆయన అడవి పొదలను గొడ్డలితో నరుకుతారు; బలవంతుని ఎదుట లెబానోను పడిపోతుంది.

  9. సరళ వృక్షాలు లెబానోను దేవదారు చెట్లు నీ గురించి సంతోషిస్తూ ఇలా అంటాయి, “నీవు పడుకుంటున్నప్పటి నుండి మమ్మల్ని నరకడానికి ఎవరూ రారు.”

  10. ఇంకా కొంతకాలం తర్వాత లెబానోను సారవంతమైన పొలంగా, సారవంతమైన పొలం అడవిగా మారదా?

  11. దేశం ఎండిపోయి క్షీణించిపోతుంది, లెబానోను సిగ్గుపడి వాడిపోతుంది; షారోను ఎడారిలా మారింది బాషాను కర్మెలు తమ చెట్ల ఆకులు రాల్చుతాయి.

  12. ఒక్కసారిగా విచ్చుకుంటుంది; అది గొప్పగా సంతోషించి ఆనందంతో కేకలు వేస్తుంది. లెబానోను మహిమ దానికి ఇవ్వబడుతుంది, కర్మెలు షారోనుల వైభవం దానికి ఉంటుంది; వారు యెహోవా మహిమను మన దేవుని వైభవాన్ని చూస్తారు.

  13. నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, ‘నాకున్న అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.

  14. బలిపీఠపు అగ్నికి లెబానోను చెట్లు సరిపోవు, దహనబలికి దాని జంతువులు చాలవు.

  15. “నా పరిశుద్ధాలయాన్ని అలంకరించడానికి లెబానోను యొక్క వైభవమైన దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, గొంజిచెట్లు నీ దగ్గరకు తీసుకువస్తారు. నేను నా పాదాలు పెట్టే స్థలాన్ని మహిమపరుస్తాను.

  16. లెబానోను మంచు దాని రాతి బండల నుండి ఎప్పుడైనా మాయమవుతుందా? సుదూర ప్రాంతాల నుండి వచ్చే దాని చల్లని జలాలు ప్రవహించడం ఆగిపోతాయా?

  17. ఎందుకంటే యూదా రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు నాకు గిలాదులా ఉన్నా, లెబానోను శిఖరంలా ఉన్నా, నిన్ను బంజరు భూమిలా, నివసించేవారు లేని పట్టణాల్లా చేస్తాను.

  18. “లెబానోనుకు వెళ్లి కేకవేయి, నీ స్వరం బాషానులో వినబడాలి, అబారీము నుండి కేకవేయి, ఎందుకంటే నీ స్నేహితులంతా నలగ్గొట్టబడ్డారు.

  19. ‘లెబానోనులో’ నివసించే నీవు దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో!

  20. వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: బలమైన రెక్కలు, పొడవైన ఈకలు కలిగి రకరకాల రంగులతో ఉన్న ఒక పెద్ద గ్రద్ద లెబానోను పర్వతానికి వచ్చి, దేవదారు చెట్టు కొమ్మపై వాలి,

  21. శెనీరు దేశపు సరళ పలకలతో వారు నీ ఓడలు తయారుచేస్తారు; లెబానోను దేవదారు చెక్కతో వారు ఓడ స్తంభాలు తయారుచేస్తారు.

  22. అష్షూరును చూడు, ఒకప్పుడు లెబానోను దేవదారులా, అందమైన కొమ్మలతో అడవిలా ఉండేది; దాని చిటారు కొమ్మ మిగతా చెట్ల కన్నా ఎత్తుగా ఉండేది.

  23. “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అది పాతాళానికి రప్పించబడిన రోజున నేను దాని గురించి దుఃఖిస్తూ లోతైన ఊటలతో దానిని కప్పివేసాను; దాని ప్రవాహాలను ఆపి, విస్తారమైన జలాలను అరికట్టాను. దాని కోసం నేను లెబానోను పర్వతాన్ని గాఢాంధకారం కమ్మేలా చేశాను, పొలం లోని చెట్లన్నీ వాడిపోయాయి.

  24. పాతాళంలోకి దిగే వారితో ఉండడానికి నేను దానిని పాతాళంలోకి దించినప్పుడు, దాని పతనం వల్ల వచ్చే శబ్దానికి నేను దేశాలు వణికిపోయేలా చేశాను. అప్పుడు ఏదెను చెట్లన్నీ, లెబానోనులో ఉత్తమమైనవి, మంచివి, సమృద్ధిగా నీరున్న చెట్లు, భూమి దిగువన ఓదార్పు పొందాయి.

  25. నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను; అతడు తామరలా వికసిస్తాడు. లెబానోను దేవదారు చెట్టులా అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి;