Skip to content

Compared To Saints గురించి బైబిల్ వచనాలు

69 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా,

  2. “యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి! అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.” తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

  3. కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను.

  4. వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.

  5. సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.

  6. కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను.

  7. గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకున్నప్పుడు కూడా, నా పావురం యొక్క రెక్కలు వెండితో, దాని ఈకలు మెరిసే బంగారంతో కప్పబడి ఉంటాయి.”

  8. అయితే ఆయన తన ప్రజలను గొర్రెల మందలా బయటకు తెచ్చారు; గొర్రెలను నడిపించినట్లు అరణ్యం గుండా ఆయన వారిని నడిపించారు.

  9. నీతిమంతులు తాటి చెట్లలా చిగురు పెడతారు, లెబానోనులో వారు దేవదారు చెట్టులా హుందాగా పెరుగుతారు.

  10. నీ యవ్వనం గ్రద్ద యవ్వనంలా క్రొత్తగా ఉండేలా, మంచి ఈవులతో నీ కోరికలను తృప్తిపరుస్తారు.

  11. యాత్రకీర్తన. యెహోవాపై నమ్మకము ఉంచేవారు కదిలించబడకుండా నిలిచి ఉండే సీయోను పర్వతంలా నిత్యం నిలిచి ఉంటారు.

  12. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు, ఇప్పుడు ఎల్లప్పుడు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటారు.

  13. యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.

  14. ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.

  15. ముళ్ళ మధ్య తామర పువ్వులా నా ప్రియురాలు ఈ కన్యకల మధ్య కనిపిస్తూ ఉన్నది.

  16. నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో,

  17. లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు లోయలో నూతన చిగురులను చూడాలని, ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.

  18. గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు.

  19. కాని యెహోవా కోసం ఎదురు చూసేవారు, నూతన బలాన్ని పొందుతారు. వారు గ్రద్ద వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు; అలసిపోకుండా పరుగెత్తుతారు. సొమ్మసిల్లకుండా నడుస్తారు.

  20. వారు మైదానంలో గడ్డిలా పెరుగుతారు, నీటికాలువల దగ్గర నాటిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.

  21. యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు; కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి మీ ఎముకలను బలపరుస్తారు. మీరు నీరు పెట్టిన తోటలా ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు.

  22. “మేఘాల్లా, తమ గూళ్లకు ఎగిరిపోయే పావురాల్లా ఎగిరే వీరెవరు?

  23. వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి. కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు; వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు, ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.”

  24. యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు.

  25. అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. “అంజూర పండ్లు, వాటిలో మంచివి చాలా బాగున్నాయి, కానీ చెడిపోయిన బాగా కుళ్లిపోయిన వాటిని మాత్రం తినలేము” అని నేను జవాబిచ్చాను.