కంటెంట్‌కు వెళ్లండి

Levi

64 వచనాలు · 18 కుటుంబ సభ్యులు

Levi ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అహవా వైపు ప్రవహించే ఓ కాలువ దగ్గర నేను వీరందరిని సమావేశపరిచాను. అక్కడ మేము మూడు రోజులు బస చేశాము. అక్కడ ఉన్న ప్రజలను యాజకులను పరిశీలించి నేను గ్రహించింది ఏంటంటే వారిలో లేవీయులెవ్వరూ లేరు.

  2. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందుకు, వారు ఇశ్రాయేలు కుమారుడైన లేవీకి పుట్టిన మహలి వారసుడు, సమర్థుడైన షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని తీసుకువచ్చారు;

  3. ఇశ్రాయేలీయులు, లేవీయులతో సహా ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్షరసాన్ని, నూనెను విరాళంగా తీసుకువచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు సంగీతకారులు వాటిని తీసుకుని పరిశుద్ధాలయపు ఉపకరణాలు ఉండే గిడ్డంగులలో ఉంచాలి. “మేము మా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాము.”

  4. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను సమయం వరకు కుటుంబ పెద్దలుగా లేవీ వారసుల పేర్లు దినచర్య గ్రంథంలో నమోదు చేయబడ్డాయి.

  5. ఓ లేవీ గృహమా, యెహోవాను స్తుతించు; యెహోవాకు పట్ల భయము కలవారలారా, యెహోవాను స్తుతించండి.

  6. ఉత్తరం వైపుగా ఉన్న గది బలిపీఠాన్ని కాపలా కాసే యాజకుల కోసము. లేవీయులలో సాదోకు వారసులైన వీరు యెహోవా సన్నిధిలో సేవ చేయటానికి వస్తారు.”

  7. పట్టణ ద్వారాలకు ఇశ్రాయేలు గోత్రాల పేర్లు పెట్టాలి. ఉత్తర దిక్కున రూబేను ద్వారం, యూదా ద్వారం, లేవీ ద్వారం ఉండాలి.

  8. లేవీ వంశీయులు వారి భార్యలు, షిమీ వంశీయులు వారి భార్యలు,

  9. నేను లేవీయులకు చేసిన ఒడంబడిక ఉండిపోయేలా నేనే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని మీరు తెలుసుకుంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  10. మీరైతే దారి తప్పారు, మీ ఉపదేశం వల్ల అనేకులు తడబడ్డారు, నేను లేవీయులతో చేసిన ఒడంబడికను వమ్ము చేశారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

  11. ఆయన వెండిని పరీక్షించి, పుటం పెట్టి శుద్ధి చేసే కంసాలిలా కూర్చుంటారు, వెండి బంగారాలను పుటం పెట్టే విధంగా ఆయన లేవీ వారిని శుద్ధి చేస్తారు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు.

  12. లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.

  13. దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు,

  14. షిమ్యోను గోత్రంలో 12,000; లేవీ గోత్రంలో 12,000; ఇశ్శాఖారు గోత్రంలో 12,000;