కంటెంట్‌కు వెళ్లండి

Jeroboam

81 వచనాలు · 4 కుటుంబ సభ్యులు

Jeroboam ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలీయులందరు అతని కోసం ఏడ్చి అతన్ని పాతిపెడతారు. యరొబాముకు చెందినవారి ఇంట్లో అతడు మాత్రమే సమాధి చేయబడతాడు, ఎందుకంటే యరొబాము ఇంటివారిలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎవరిలోనైనా మంచిని కనుగొన్నారా అంటే అది కేవలం అతనిలో మాత్రమే.

  2. “యెహోవా తన కోసం ఇశ్రాయేలు మీద రాజును లేవనెత్తుతారు, అతడు యరొబాము వంశాన్ని నిర్మూలం చేస్తాడు. ఇది ఇప్పటికే మొదలయ్యింది.

  3. యరొబాము చేసిన పాపాలను బట్టి, అతడు ఇశ్రాయేలు ప్రజలచేత చేయించిన పాపాన్ని బట్టి ఆయన ఇశ్రాయేలును వదిలేస్తారు.”

  4. అప్పుడు యరొబాము భార్య లేచి బయలుదేరి తిర్సాకు వెళ్లింది. ఆమె గడపలో అడుగుపెట్టిన వెంటనే ఆ బాలుడు చనిపోయాడు.

  5. యరొబాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని యుద్ధాలు, అతడు ఎలా పరిపాలించాడనేది ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

  6. యరొబాము ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతడు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు నాదాబు రాజయ్యాడు.

  7. రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది.

  8. నెబాతు కుమారుడు యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు,

  9. అబీయా బ్రతికిన కాలమంతా అతనికి యరొబాముకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది.

  10. అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అబీయాము యరొబాముకు యుద్ధం జరిగేది.

  11. ఇశ్రాయేలు రాజైన యరొబాము పరిపాలనలోని ఇరవయ్యవ సంవత్సరంలో, ఆసా యూదా దేశానికి రాజయ్యాడు.

  12. యూదా దేశంలో రాజైన ఆసా పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యరొబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలును పరిపాలించాడు.

  13. అతడు రాజైన వెంటనే యరొబాము వంశం వారినందరిని చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఏ ఒక్కని కూడా వదిలిపెట్టకుండా వారందరిని నిర్మూలం చేశాడు. యెహోవా తన సేవకుడు, షిలోహు వాడైన అహీయా ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం ఇది జరిగింది.

  14. యరొబాము పాపం చేసి ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారకుడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు కాబట్టి ఇలా జరిగింది.

  15. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ, యరొబాము ఇశ్రాయేలు ప్రజలను పాపంలోకి నడిపించినట్లు అతడు కూడా చేశాడు.

  16. “నేను నిన్ను మట్టిలో నుండి పైకి లేవనెత్తి నా ప్రజలైన ఇశ్రాయేలు మీద పాలకునిగా చేశాను. అయితే నీవు యరొబాము విధానాలను అనుసరించి, నా ప్రజలైన ఇశ్రాయేలు పాపం చేసేలా చేసి, వారి పాపాలను బట్టి నాకు కోపం రేపావు.

  17. కాబట్టి నేను బయెషాను, అతని వంశాన్ని తుడిచివేస్తాను. నీ ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా చేస్తాను.

  18. అంతేకాక బయెషాకు, అతని వంశానికి వ్యతిరేకంగా యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహు ప్రవక్త ద్వారా వచ్చింది. ఎందుకంటే యెహోవా దృష్టిలో అతడు చెడు చేసినందుకు, యరొబాము కుటుంబాన్ని నిర్మూలం చేసినందుకు అతడు యెహోవాకు కోపం రేపాడు.

  19. యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ యెహోవా దృష్టిలో పాపం చేసి, యరొబాములా ఇశ్రాయేలు ప్రజల పాపం చేయడానికి అతడు కారణమయ్యాడు కాబట్టి ఇలా జరిగింది.

  20. అతడు నెబాతు కుమారుడైన యరొబాము ఎలా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమై తమ అయోగ్యమైన విగ్రహాలను పెట్టుకుని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడో అదే విధానాన్ని అనుసరించాడు.

  21. అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను తక్కువగా పరిగణించడమే కాకుండా, సీదోను రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును పెళ్ళి చేసుకుని బయలును సేవించి పూజించడం ప్రారంభించాడు.

  22. నీ వంశాన్ని నెబాతు కుమారుడైన యరొబాము వంశంలా, అహీయా కుమారుడైన బయెషా వంశంలా చేస్తాను, ఎందుకంటే నీవు నాకు కోపం రేపావు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు’ అని అన్నారు.

  23. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు తన తల్లిదండ్రుల విధానాలను ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము జీవిత విధానాలను అనుసరించాడు.

  24. అయితే ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే ఇతడు కూడా చేస్తూ వచ్చాడు.

  25. నేను నెబాతు కుమారుడైన యరొబాము వంశాన్ని, అహీయా కుమారుడైన బయెషా వంశాన్ని చేసినట్టే, అహాబు వంశాన్ని చేస్తాను.