కంటెంట్‌కు వెళ్లండి

Hezekiah

116 వచనాలు · 5 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Ezekias

Hezekiah ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, భక్తితో అతడు చేసిన పనులు ఆమోజు కుమారుడు ప్రవక్తయైన యెషయాకు కలిగిన దర్శనాల గ్రంథంలోనూ యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలోనూ వ్రాయబడ్డాయి.

  2. హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు వారసుల శ్మశానభూమిలోని పై భాగంలో అతన్ని పాతిపెట్టారు. అతడు చనిపోయినప్పుడు యూదా వారంతా యెరూషలేము నివాసులంతా అతని అంత్యక్రియలు ఘనంగా జరిగించారు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.

  3. తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు. బయలు దేవతకు బలిపీఠాలను కట్టించాడు. అషేరా స్తంభాలను నిలిపాడు. అతడు ఆకాశనక్షత్రాలకు మ్రొక్కి వాటిని పూజించాడు.

  4. ఇవి కూడా సొలొమోను యొక్క సామెతలు, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని పోగుచేశారు.

  5. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము.

  6. రాజైన హిజ్కియా పాలన పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.

  7. అప్పుడు అష్షూరు రాజు లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా మీదికి గొప్ప సైన్యంతో తన యుద్ధభూమిలో ఉన్న సైన్యాధిపతిని పంపించాడు. ఆ సైన్యాధిపతి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగినప్పుడు,

  8. అప్పుడు సైన్యాధిపతి వారితో ఇలా అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి: “ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం?

  9. అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది?

  10. రాజు చెప్పే మాట ఇదే: హిజ్కియా మిమ్మల్ని మోసం చేయకుండ చూసుకోండి. అతడు మిమ్మల్ని విడిపించలేడు.

  11. హిజ్కియా, ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తారు; ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు’ అని చెప్తూ యెహోవా మీద నమ్మకం ఉంచేలా ప్రేరేపించనివ్వకండి.

  12. “హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు.

  13. “హిజ్కియా, ‘యెహోవా మనల్ని విడిపిస్తారు’ అని చెప్తూ మిమ్మల్ని తప్పుత్రోవ పట్టనివ్వకండి. ఇతర దేశాల దేవుళ్ళు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించారా?

  14. అప్పుడు హిల్కీయా, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు, తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వెళ్లి అష్షూరు సైన్యాధిపతి చెప్పింది అతనికి తెలియజేశారు.

  15. ఇది విని రాజైన హిజ్కియా తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి వెళ్లాడు.

  16. వారు అతనితో ఇలా అన్నారు, “హిజ్కియా చెప్పిన మాట ఇదే: ఈ రోజు బాధ, చీవాట్లు, అవమానం ఉన్న రోజు, బిడ్డ పుట్టడానికి సమయం దగ్గరకు వచ్చినా కనే శక్తిలేని స్త్రీలా ఉంది.

  17. రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు,

  18. అప్పుడు, కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడనే వార్త సన్హెరీబు విన్నప్పుడు, అతడు దూతలతో హిజ్కియా దగ్గరకు ఇలా సందేశం పంపాడు:

  19. “యూదా రాజైన హిజ్కియాకు ఇలా చెప్పండి: నీవు నమ్ముకున్న నీ దేవుడు నీతో, ‘యెరూషలేము అష్షూరు రాజు చేతికి ఇవ్వబడదు’ అని చెప్పే మోసపు మాటలకు మోసపోవద్దు.

  20. హిజ్కియా దూతల నుండి లేఖ తీసుకుని దానిని చదివాడు. తర్వాత యెహోవా ఆలయానికి వెళ్లి, యెహోవా సముఖంలో ఆ ఉత్తరాన్ని తెరిచాడు.

  21. హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు:

  22. అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: అష్షూరు రాజైన సన్హెరీబు గురించి నీవు నాకు ప్రార్థన చేసినందుకు,

  23. ఆ రోజుల్లో హిజ్కియాకు జబ్బుచేసి మరణానికి దగ్గరలో ఉన్నాడు. ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త అతని దగ్గరకు వెళ్లి, “యెహోవా చెప్పే మాట ఇదే: నీవు చనిపోబోతున్నావు; నీవు కోలుకోవు, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో” అన్నాడు.

  24. హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకుని యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు,

  25. “యెహోవా, నేను నమ్మకంగా యథార్థ హృదయంతో, మీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో, మీ దృష్టిలో సరియైనది ఎలా చేశానో జ్ఞాపకం చేసుకోండి.” హిజ్కియా భారంగా ఏడ్చాడు.