కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అంతేగాక వారు నా ప్రజలకు పవిత్రమైన వాటికి సాధారణమైన వాటి మధ్య భేదాన్ని బోధిస్తారు; పవిత్రమైన దానికి, అపవిత్రమైన దానికి మధ్య తేడా ఏమిటో వారికి చూపిస్తారు.

  2. “ ‘ఏదైనా వివాదం ఉన్నప్పుడు యాజకులు న్యాయమూర్తులుగా వ్యవహరించి నా శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వాలి. నా నియమించబడిన పండుగలన్నిటిలో వారు నా ధర్మశాస్త్రాన్ని శాసనాలను పాటించాలి, వారు నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.

  3. పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి పరిశుద్ధాలయం లోపలి ఆవరణంలోనికి వెళ్లినప్పుడు అతడు పాపపరిహారబలి అర్పించాలి, అని ప్రభువైన యెహోవా ప్రకటించారు.

  4. “ ‘యాజకులకు ఉన్న ఏకైన వారసత్వం నేనే. నీవు వారికి ఇశ్రాయేలులో స్వాస్థ్యం ఇవ్వకూడదు; నేనే వారికి స్వాస్థ్యంగా ఉంటాను.

  5. “ ‘మీరు భూమిని వారసత్వంగా కేటాయిస్తున్నప్పుడు, మీరు భూమి నుండి ఒక భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఆ భాగం పొడవు 25,000 మూరలు, వెడల్పు 20,000 మూరలు ఉండాలి; ఆ స్థలమంతా ప్రతిష్ఠితమవుతుంది.

  6. యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలమవుతుంది. అది వారి ఇళ్ళకు స్థలంగా పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది.

  7. ఈ భూమి ఇశ్రాయేలులో అతనికి స్వాస్థ్యంగా ఉంటుంది. నా అధిపతులు ఇకపై నా ప్రజలను హింసించరు కానీ ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల ప్రకారం భూమిని కేటాయించుకోడానికి అనుమతిస్తారు.

  8. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  9. అలాగే ఇశ్రాయేలులో మంచి నీరున్న పచ్చికబయళ్లలో మేపిన మందలోని ప్రతి రెండు వందలకు ఒక గొర్రెను తీసుకోవాలి. ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వీటిని భోజనార్పణలు, దహనబలులు, సమాధాన బలులకు ఉపయోగిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  10. “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మొదటి నెల మొదటి రోజున లోపం లేని కోడెను తీసుకుని పరిశుద్ధాలయాన్ని శుద్ధి చేయాలి.

  11. పండుగ జరిగే ఏడు రోజుల్లో ప్రతిరోజు అతడు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఏడు ఎద్దులు ఏడు పొట్టేళ్లను, పాపపరిహారబలిగా ఒక మేకపోతును ఇవ్వాలి.

  12. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఆరు పని దినాల్లో తూర్పు ముఖంగా ఉన్న లోపలి ఆవరణ ద్వారం మూసివేయబడాలి, అయితే సబ్బాతు దినాన అమావాస్య రోజున దానిని తెరవాలి.

  13. సబ్బాతులలో, అమావాస్యల్లో దేశ ప్రజలు ఆ ద్వారం దగ్గర నిలబడి యెహోవాను ఆరాధించాలి.

  14. సబ్బాతు దినాన యువరాజు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఆరు మగ గొర్రెపిల్లలను ఒక పొట్టేలును అర్పించాలి.

  15. “ ‘దేశ ప్రజలు నియమించబడిన పండుగల్లో యెహోవా సన్నిధికి ఆరాధించడానికి వచ్చినప్పుడు, ఉత్తర ద్వారం నుండి వచ్చేవారు దక్షిణ ద్వారం నుండి బయటకు వెళ్లాలి; దక్షిణ ద్వారం నుండి వచ్చేవారు ఉత్తర ద్వారం నుండి బయటకు వెళ్లాలి. ఎవరూ తాము వచ్చిన ద్వారం గుండా తిరిగి వెళ్లకుండా ప్రతిఒక్కరు తిన్నగా బయటకు వెళ్లాలి.

  16. “ ‘యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని యువరాజు అర్పించేటప్పుడు అతని కోసం తూర్పు వైపు ద్వారం తలుపులు తెరవాలి. సబ్బాతు దినాన అర్పించునట్లుగానే దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తర్వాత ద్వారం తలుపులు మూసివేయాలి.

  17. “ ‘ప్రతిరోజు మీరు యెహోవాకు దహనబలిగా ఏ లోపం లేని ఒక సంవత్సరం వయస్సున్న గొర్రెపిల్లను అందించాలి. ప్రతి ఉదయం మీరు దానిని ఏర్పాటు చేయాలి.

  18. మీరు దానితో ప్రతి ఉదయం భోజనార్పణను ఏర్పాటు చేయాలి, పిండిని తేమగా ఉంచడానికి ఒక ఏఫాలో ఆరవ వంతు నూనెతో పాటు, ఒక హిన్‌లో మూడింట ఒక వంతు నూనె ఉంటుంది. ఈ భోజనార్పణను యెహోవాకు సమర్పించడమనేది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  19. “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: అధిపతి వారసత్వంగా పొందిన భూమిలో ఒక భాగం తన కొడుక్కు ఇస్తే అది అతనికే సంక్రమిస్తుంది. ఇది వారసత్వ నియమము.

  20. ప్రజలను వారి స్వాస్థ్యంలో నుండి బయటకు వెళ్లగొట్టి, వారి వారసత్వంలో నుండి అధిపతి ఏదీ తీసుకోకూడదు. అధిపతి తన భూమిలో నుండి తన కుమారునికి భాగాలివ్వాలి. దేవుని ప్రజల్లో ఎవరూ తమ భూములను విడిచి చెదరిపోకూడదు.’ ”

  21. అతడు మరో వెయ్యి కొలిచాడు, కానీ ఇప్పుడు అది నేను దాటలేని నదిగా ఉంది, ఎందుకంటే నీళ్లు ఎక్కువై ఈదగలిగినంత లోతుగా ఉంది.

  22. నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నదికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో చెట్లు కనిపించాయి.

  23. ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: “ఇవి ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి స్వాస్థ్యంగా మీరు పంచుకునే దేశ సరిహద్దులు, యోసేపుకు రెండు వంతులు.

  24. నీవు దానిని వారి మధ్య సమానంగా పంచాలి. మీ పూర్వికులకు ఇస్తానని చేయెత్తి ప్రమాణం చేశాను కాబట్టి, ఈ భూమి మీకు వారసత్వంగా మారుతుంది.

  25. ఏ గోత్రికుల మధ్య పరదేశులు నివసిస్తున్నారో ఆ గోత్రాల భూభాగంలో వారికి వారసత్వం ఇవ్వాలి” అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.