కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నేను మాగోగు మీదికి, సముద్ర తీర ప్రాంతాల్లో క్షేమంగా నివసించేవారి మీదికి అగ్ని పంపిస్తాను, అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

  2. “ ‘నా పరిశుద్ధ నామాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య వెల్లడి చేస్తాను. ఇకపై నా పరిశుద్ధ నామం అవమానానికి గురి కానివ్వను, అప్పుడు నేనే యెహోవానని ఇశ్రాయేలులో పరిశుద్ధుడనని ఇతర దేశాల ప్రజలు తెలుసుకుంటారు.

  3. ఆ సమయం వస్తుంది! అది ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. వారు పొలంలో కట్టెలు ఏరుకోకుండా అడవిలో చెట్లు నరకకుండా ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. వారు తమను దోచుకున్న వారిని తిరిగి దోచుకుంటారు. తమను కొల్లగొట్టిన వారిని తిరిగి కొల్లగొడతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  5. “ ‘ఆ రోజున నేను సముద్రానికి తూర్పుగా ప్రయాణికులు వెళ్లే లోయలో ఇశ్రాయేలు దేశంలో గోగును, అల్లరిమూకలను పాతిపెట్టడానికి స్థలం ఇస్తాను. అక్కడ గోగును, అతని అల్లరిమూకలన్ని పాతిపెట్టిన తర్వాత ప్రయాణికులు వెళ్లడానికి వీలుపడదు. ఆ లోయకు హమోన్ గోగు అనే పేరు వస్తుంది.

  6. దేశంలోని ప్రజలందరూ వారిని పాతిపెడతారు, నేను ఘనత పొందిన ఆ రోజు వారికి ఘనత కలుగుతుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  7. “మనుష్యకుమారుడా, ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు అన్ని రకాల పక్షులకు అడవి మృగాలకు ఇలా చెప్పు: ‘నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలికి అనగా ఇశ్రాయేలు పర్వతాలమీద జరుగబోయే గొప్ప బలి దగ్గరకు నలువైపుల నుండి తరలి రండి, అక్కడ మీరు మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగుతారు.

  8. నేను మీ కోసం సిద్ధపరుస్తున్న బలి దగ్గర కడుపునిండా ఆ క్రొవ్వును తింటారు. మత్తు ఎక్కేవరకు రక్తం త్రాగుతారు.

  9. నేను ఏర్పరచిన బల్ల దగ్గర గుర్రాలను, రౌతులను బలవంతులను, సైనికులందరిని కడుపారా తింటారు.’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  10. “నా మహిమను ఇతర ప్రజలమధ్య చూపుతాను. ఇతర ప్రజలందరు నేను విధించిన శిక్షను నేను వారిపై ఉంచిన చేతిని చూస్తారు.

  11. ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు నేనే వారి దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు.

  12. ఇశ్రాయేలీయులు పాపం చేసిన కారణంగా బందీలుగా వెళ్లవలసి వచ్చిందని, నా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు నేను వారికి నా ముఖం దాచి వేసి వారంతా కత్తివేటుకు కూలిపోయేలా వారి శత్రువులకు అప్పగించానని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.

  13. వారి అపవిత్రత తిరుగుబాటుతనం బట్టి నేను వారికి విరోధినై వారికి తగిన ప్రతీకారం చేశాను.

  14. “కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నా పరిశుద్ధ నామాన్ని బట్టి రోషం కలిగి యాకోబు సంతతిని చెరలో నుండి రప్పిస్తాను. ఇశ్రాయేలు ప్రజలందరినీ కనికరిస్తాను.

  15. ఎవరినుండి భయం లేకుండా వారు తమ స్వదేశంలో క్షేమంగా నివసిస్తున్నప్పుడు వారు నాకు చేసిన నమ్మకద్రోహాన్ని, దానివల్ల వారు పొందిన అవమానాన్ని మర్చిపోతారు.

  16. నేను వారిని ఇతర జనాల్లో నుండి బయటకు తీసుకువచ్చి శత్రు దేశాల నుండి వారిని సమకూర్చినప్పుడు వారి ద్వారా అనేక జనుల మధ్యలో నన్ను నేను పరిశుద్ధునిగా కనుపరచుకుంటాను.

  17. నేను వారిని ఇతర ప్రజల మధ్యలోనికి బందీలుగా పంపి, ఎవరినీ విడిచిపెట్టకుండా వారందరిని వారి స్వదేశానికి సమకూరుస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని వారి దేవుడనని తెలుసుకుంటారు.

  18. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”

  19. అప్పటికి మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదవ సంవత్సరంలోని మొదటి నెల పదవ రోజున, అనగా పట్టణం నాశనమైన పద్నాలుగవ సంవత్సరంలో ఆ రోజునే యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఆయన నన్ను పట్టణానికి తీసుకెళ్లారు.

  20. దేవుని దర్శనంలో ఆయన నన్ను ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్లి చాలా ఎత్తైన పర్వతం మీద నన్ను ఉంచారు. దాని మీద దక్షిణం వైపున ఒక పట్టణం లాంటిది నాకు కనిపించింది.

  21. ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లగా మెరుస్తున్న ఇత్తడిలా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను. అతడు తన చేతిలో నార దారం, కొలిచే కర్ర పట్టుకుని పట్టణ ద్వారంలో నిలబడి ఉన్నాడు.

  22. ఉత్తరం వైపుగా ఉన్న గది బలిపీఠాన్ని కాపలా కాసే యాజకుల కోసము. లేవీయులలో సాదోకు వారసులైన వీరు యెహోవా సన్నిధిలో సేవ చేయటానికి వస్తారు.”

  23. అక్కడ చెక్కతో చేయబడి ఉన్న బలిపీఠం ఎత్తు మూడు మూరలు పొడవు రెండు మూరలు. దాని మూలలు అడుగుభాగం ప్రక్క భాగం కర్రతో చేయబడ్డాయి. “ఇది యెహోవా ఎదుట ఉండే బల్ల” అని అతడు నాతో చెప్పాడు.

  24. అప్పుడతడు నాతో ఇలా అన్నాడు, “ఆలయ ఆవరణానికి ఎదురుగా ఉత్తర గదులు, దక్షిణ గదులు యాజకులకు చెందినవి; అక్కడ యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ అర్పణలను తింటారు. అక్కడే వారు అతి పరిశుద్ధ అర్పణలను అనగా భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులను ఉంచుతారు. ఆ స్థలం అతిపరిశుద్ధమైనది.

  25. ఇశ్రాయేలు దేవుని మహిమ తూర్పు నుండి రావడం నేను చూశాను. ఆయన స్వరం, ప్రవహించే జలాల గర్జనలా ఉంది, భూమి ఆయన మహిమతో ప్రకాశిస్తూ ఉంది.