కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు ఇకపై తమ విగ్రహాలతో, నీచమైన చిత్రాలతో గాని వారి నేరాలతో గాని తమను తాము అపవిత్రం చేసుకోరు, ఎందుకంటే వారు పాపాలు చేస్తూ నివసించిన ప్రతి స్థలం నుండి నేను వారిని రక్షించి, వారిని శుద్ధి చేస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.

  2. “ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు.

  3. నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశంలో అనగా మీ పూర్వికులు నివసించిన దేశంలో వారు నివసిస్తారు. వారు వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యం నివసిస్తారు. నా సేవకుడైన దావీదు వారికి శాశ్వతమైన అధిపతిగా ఉంటాడు.

  4. నేను వారితో సమాధాన ఒప్పందాన్ని చేస్తాను; అది నాకు వారికి మధ్య శాశ్వత నిబంధనగా ఉంటుంది. నేను వారిని స్థిరపరచి వారిని విస్తరింపచేస్తాను, వారి మధ్య నా పరిశుద్ధాలయాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను.

  5. నా నివాసస్థలం వారితో ఉంటుంది; నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.

  6. వారి మధ్య నా పరిశుద్ధాలయం నిత్యం ఉండడం చూసి ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచే యెహోవాను నేనే అని ఇతర ప్రజలు తెలుసుకుంటారు.’ ”

  7. యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  8. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు ముఖ్య అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.

  9. నేను నిన్ను వెనక్కు త్రిప్పి, నీ దవడలకు కొక్కేలు తగిలించి, నిన్ను సైన్యమంతటితో పాటు, నీ గుర్రాలను, సంపూర్ణ సాయుధులైన నీ రౌతులను, పెద్ద చిన్న డాళ్లను ధరించి, వారంతా ఖడ్గాలు ఆడిస్తూ పట్టుకున్న యోధులను బయటకు తీసుకువస్తాను.

  10. “ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఆ రోజు నీ మనస్సులో చెడు ఆలోచనలు పుడతాయి. నీవు చెడు పన్నాగం పన్ని,

  11. దురాలోచనతో నీవు ఇలా అంటావు, “నేను గోడలులేని గ్రామాలున్న దేశంపై దాడి చేస్తాను; గోడలు ద్వారాలు అడ్డగడియలు లేని దేశంలో ప్రశాంతంగా క్షేమంగా నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తాను.

  12. “మనుష్యకుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా నివసించే రోజున నీవు ఇది గమనించలేదా?

  13. దేశాన్ని మేఘం క్రమ్మినట్లు మీరంతా నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీదికి వస్తారు. రాబోయే రోజుల్లో అది జరుగుతుంది; నీ ద్వారా ఇతర ప్రజల ఎదుట నేను పరిశుద్ధుడను అని కనుపరిచినప్పుడు వారు నన్ను తెలుసుకునేలా గోగూ, నేను నిన్ను నా దేశం మీదికి రప్పిస్తాను.

  14. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: పూర్వకాలంలో నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడింది నీ గురించే. నేను నిన్ను వారికి వ్యతిరేకంగా తీసుకువస్తానని అనేక సంవత్సరాలుగా వారు ప్రవచించారు.

  15. ఆ రోజున గోగు ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తి వచ్చేటప్పుడు నా కోపం తీవ్రంగా ఉంటుంది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

  16. నేను రోషంతో, కోపోద్రేకంతో ఏమని ప్రకటించానంటే, ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంలో భయంకరమైన భూకంపం వస్తుంది.

  17. అప్పుడు సముద్రంలోని చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకే పురుగులు, భూమి మీద ఉన్న మనుష్యులందరు నా ఎదుట వణుకుతారు. పర్వతాలు కూలిపోతాయి, కొండచరియలు విరిగిపోతాయి, ప్రతి గోడ నేలమట్టం అవుతుంది.

  18. నేను నా పర్వతాలన్నిటిపైన గోగుకు వ్యతిరేకంగా ఖడ్గాన్ని రప్పిస్తాను. ప్రతి ఒక్కని ఖడ్గం తన సోదరుని మీద పడుతుంది అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. తెగులుతో రక్తపాతంతో అతని మీద తీర్పు తీరుస్తాను; అతనిపై అతని సైన్యం మీద అతనితో పాటు ఉన్న అనేక దేశాలపై నేను కుండపోత వర్షాన్ని, వడగండ్లను అగ్నిగంధకాలను కురిపిస్తాను.

  20. నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను చూపించి ఇతర జనుల ఎదుట నన్ను నేను ప్రత్యక్ష్యపరచుకుంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’

  21. “మనుష్యకుమారుడా, గోగు గురించి ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మెషెకుకు తుబాలుకు అధిపతియైన గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను.

  22. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, దూరంగా ఉన్న ఉత్తర దిక్కునుండి రప్పించి ఇశ్రాయేలు పర్వతాల మీదికి పంపుతాను.

  23. అప్పుడు నేను నీ ఎడమచేతి నుండి నీ విల్లు, నీ కుడిచేతి నుండి నీ బాణాలు క్రింద పడేలా చేస్తాను.

  24. నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.

  25. నీవు పొలంలో పడిపోతావు; నేను మాట ఇచ్చాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.