కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ సమయంలో ఈ ప్రజలకు, యెరూషలేముకు ఇలా ప్రకటించబడుతుంది: “ఎడారిలో బంజరు కొండల నుండి మండే గాలి నా ప్రజల వైపు వీస్తుంది, కానీ పొట్టు చెరగడానికో లేదా శుభ్రం చేయడానికో కాదు.

  2. అంతకంటే బలమైన గాలి నా మీద వీచింది, యెహోవా చెప్పినట్లు వారి మీదికి నా తీర్పులు ప్రకటిస్తున్నాను.”

  3. పొలంలో కాపలా కాస్తున్న మనుష్యుల్లా వారు ఆమెను చుట్టుముట్టారు, ఎందుకంటే ఆమె నా మీదికి తిరుగుబాటు చేసింది’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  4. “నా ప్రజలు మూర్ఖులు; వారికి నేను తెలియదు. వారు బుద్ధిలేని పిల్లలు; వారికి వివేచన లేదు. వారు కీడు చేయడంలో నేర్పరులు; మంచి చేయడం ఎలాగో వారికి తెలియదు.”

  5. నేను చూశాను, ఫలవంతమైన భూమి ఎడారి; దాని పట్టణాలన్ని యెహోవా ఎదుట, ఆయన ఉగ్రమైన కోపం ముందు శిథిలమైపోయాయి.

  6. యెహోవా ఇలా అంటున్నాడు: “నేను దానిని పూర్తిగా నాశనం చేయనప్పటికీ, దేశమంతా పాడైపోతుంది.

  7. కాబట్టి భూమి దుఃఖిస్తుంది పైనున్న ఆకాశం అంధకారం అవుతుంది, నేను మాట్లాడాను కాబట్టి పశ్చాత్తాపపడను, నేను నిర్ణయించుకున్నాను, కాబట్టి వెనుకకు తిరగను.”

  8. ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, ఊపిరి కోసం అల్లాడుతూ, సీయోను కుమారి తన చేతులు చాచి, “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.

  9. “యెరూషలేము వీధుల్లోకి వెళ్లి, చుట్టూ చూసి పరిశీలించండి, దాని కూడళ్లలో వెదకండి. నమ్మకంగా వ్యవహరించే సత్యాన్ని వెదికే ఒక్క వ్యక్తినైనా మీరు కనుగొనగలిగితే, నేను ఈ పట్టణాన్ని క్షమిస్తాను.

  10. వారు, ‘సజీవుడైన యెహోవా మీద ప్రమాణం’ అని అన్నప్పటికీ, వారు అబద్ధపు ప్రమాణమే చేస్తున్నారు.”

  11. యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

  12. నేను ఇలా అనుకున్నాను, “వీరు పేదవారు; వారు బుద్ధిహీనులు, ఎందుకంటే వారికి యెహోవా మార్గం తెలియదు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలియదు.

  13. కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడతాను; ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, బంధకాలను తెంపుకున్నారు.

  14. “నేను నిన్ను ఎందుకు క్షమించాలి? మీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. వారి అవసరాలన్నీ నేను తీర్చాను, అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు వేశ్యల ఇళ్ళకు గుమికూడారు.

  15. అందుకు నేను వారిని శిక్షించవద్దా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోవద్దా?

  16. “ఆమె ద్రాక్షతోట వరుసల గుండా వెళ్లి వాటిని నాశనం చేయండి, అయితే వాటిని పూర్తిగా నాశనం చేయవద్దు. వాటి కొమ్మలను తీసివేయండి, ఎందుకంటే ఈ ప్రజలు యెహోవాకు చెందినవారు కారు.

  17. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు నా పట్ల పూర్తిగా నమ్మకద్రోహులుగా ఉన్నారు” అని యెహోవా అంటున్నారు.

  18. వారు యెహోవా గురించి అబద్ధం చెప్పారు; వారు, “ఆయన ఏమీ చేయడు! మాకు ఎలాంటి హాని జరగదు; మేము ఖడ్గం గాని కరువు గాని ఎన్నడూ చూడము.

  19. కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: “ప్రజలు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి, నేను నీ నోటిలో నా మాటలను అగ్నిగాను ఈ ప్రజలను అది కాల్చివేసే కలపగాను చేస్తాను.

  20. ఇశ్రాయేలు ప్రజలారా,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను మీ మీదికి దూర దేశాన్ని రప్పిస్తున్నాను, చాలా కాలంనాటి, శాశ్వతమైన దేశం, ఎవరి భాష మీకు తెలియదో, ఎవరి మాట మీకు అర్థం కాదో, అలాంటి ప్రజలను.

  21. “అయినప్పటికీ ఆ రోజుల్లో” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయను.

  22. ఒకవేళ ప్రజలు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇదంతా చేశారు?’ అని అడిగితే మీరు వారితో ఇలా చెప్తారు, ‘మీరు నన్ను విడిచి మీ స్వదేశంలో పరదేశి దేవుళ్ళను సేవించారు, కాబట్టి ఇప్పుడు మీరు మీది కాని దేశంలో విదేశీయులకు సేవ చేయాలి.’

  23. మీరు నాకు భయపడరా?” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నా సన్నిధిలో మీరు వణకరా? నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు.

  24. ‘మనం మన దేవుడైన యెహోవాకు భయపడదాం, ఆయన తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తారు, నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను గురించి మనకు నిశ్చయత కలిగించేవాడు ఆయనే’ అని వారు తమ హృదయాల్లో అనుకోరు.

  25. “నా ప్రజలమధ్య దుర్మార్గులు ఉన్నారు వారు పక్షులకు వలలు వేసే మనుష్యుల్లా మనుష్యులను పట్టుకోవడానికి వేటగానిలా పొంచి ఉన్నారు.