కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మూర్ఖులు యెహోవాకు అసహ్యులు కాని యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు.

  2. దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.

  3. ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.

  4. ఎందుకంటే మనుష్యుల మార్గాలు యెహోవా కళ్ళెదుట ఉన్నాయి, ఆయన వారి మార్గాలన్నిటిని పరిశీలిస్తారు.

  5. యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.

  6. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.

  7. “యెహోవా తన సృష్టి ఆరంభ దినాన తాను చేసినపనులలో మొదటి పనిగా నన్ను చేశారు;

  8. భూమిని, మైదానములను దేవుడు చేయక ముందు, నేల మట్టి కొంచెము కూడా సృష్టించబడక ముందు నేను పుట్టితిని.

  9. దేవుడు ఆకాశ, విశాలములను సృష్టించి ఎంతో నీటి మీద మండలమును, సృష్టించినపుడు నేను పుట్టితిని.

  10. దేవుడు పైన మేఘాలను చేసినప్పుడు నీటి ధారలను ఆయన చేసినప్పుడు,

  11. నీరు తమ హద్దులు దాటి రాకుండా దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు.

  12. నేను దేవుని యొద్ద నైపుణ్యత కలిగిన పనివానిగా, ప్రతిరోజు సంతోషిస్తూ, ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాను,

  13. దేవుడు కలుగజేసిన స్వర్గాన్ని బట్టి సంతోషిస్తూ మనుష్యులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను.

  14. నన్ను కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు, వారు యెహోవా దయ పొందుకుంటారు.

  15. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం, పవిత్రమైన దేవుని గురించిన తెలివియే మంచి చెడులను గురించి తెలుసుకొనుటకు ఆధారం.

  16. యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు, కాని దుష్టుల కోరికను ఆయన పాడుచేస్తారు.

  17. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.

  18. యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి.

  19. నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.

  20. మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము.

  21. వక్ర హృదయాలు గలవారిని యెహోవా అసహ్యించుకుంటారు, అయితే నిందారహితమైన మార్గాలు గలవారిని బట్టి ఆయన సంతోషిస్తారు.

  22. మంచివారు యెహోవా దయ పొందుతారు, చెడు ఆలోచనలు చేసేవారికి శిక్ష విధిస్తారు.

  23. అబద్ధాలు మాట్లాడేవారు యెహోవాకు అసహ్యం నమ్మదగినవారు ఆయనకు ఇష్టులు.

  24. యెహోవాకు భయపడేవారు యథార్థంగా నడుస్తారు, ఆయనను తృణీకరించేవారు వారి మార్గాల్లో వంచకులు.

  25. యెహోవాకు భయపడేవారందరికి సురక్షితమైన కోట ఉంది, వారి పిల్లలకు అది ఆశ్రయంగా ఉంటుంది.