God
God ను ప్రస్తావించే వచనాలు
ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు; ఆయన న్యాయవిధులు వారికి తెలియవు. యెహోవాను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.
యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి; పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.
ఉన్నత ఆకాశాల్లారా, అంతరిక్షానికి పైన ఉన్న జలాల్లారా ఆయనను స్తుతించండి.
అవి యెహోవా నామాన్ని స్తుతించును గాక, ఎందుకంటే ఆయన ఆజ్ఞమేరకు అవి సృజించబడ్డాయి,
ఆయన వాటిని నిత్యం నుండి నిత్యం వరకు స్థాపించారు, ఆయన ఎన్నటికీ రద్దు చేయబడని శాసనం జారీ చేశారు.
భూమి మీద ఉన్న గొప్ప సముద్ర జీవులారా యెహోవాను స్తుతించండి, సమస్త సముద్రపు అగాధాల్లారా,
మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు, ఈదురు గాలులు,
వారు యెహోవా నామాన్ని స్తుతించుదురు గాక. ఆయన నామము మాత్రమే మహోన్నతం; ఆయన వైభవం భూమిపై ఆకాశంపై ఉన్నది.
ఆయన తన ప్రజల కోసం ఒక కొమ్మును లేపారు, అది ఇశ్రాయేలులో ఆయనకు నమ్మకమైన సమస్త సేవకులు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ప్రజలు యొక్క స్తుతి. యెహోవాను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.
ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.
వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు తంబురతో సితారాతో గానం చేస్తారు.
యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు; దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.
వారి నోళ్ళలో దేవుని స్తుతి వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.
To execute upon them the judgment written: this honour have all his saints. Praise ye the LORD.
యెహోవాను స్తుతించండి. పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి; ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.
కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.
తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో, ఆయనను స్తుతించండి.
ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించండి.
యెహోవాయందు భయం తెలివికి మూలం, అయితే మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తృణీకరిస్తారు.
నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.