కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు?

  2. యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి; పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి.

  3. మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి.

  4. పైనుండి మీ చేయి చాపండి; గొప్ప జలాల నుండి, విదేశీయుల చేతుల్లో నుండి, నన్ను విడిపించండి.

  5. నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను.

  6. రాజులకు విజయమిచ్చేది, మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. భయంకరమైన ఖడ్గము నుండి

  7. ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు; యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు.

  8. దావీదు వ్రాసిన స్తుతికీర్తన. నా దేవా, నా రాజా! మిమ్మల్ని ఘనపరుస్తాను. మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.

  9. ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.

  10. యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు; ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.

  11. ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు; మీ బలమైన చర్యలను గురించి చెపుతారు.

  12. వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు, నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను.

  13. వారు మీ అద్భుత కార్యాల శక్తి గురించి చెపుతారు, నేను మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను.

  14. వారు మీ సమృద్ధి మంచితనాన్ని స్తుతిస్తారు, మీ నీతి గురించి సంతోషంగా పాడతారు.

  15. యెహోవా కృప కలవారు, దయ గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.

  16. యెహోవా అందరికి మంచివారు; ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు.

  17. యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది; నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.

  18. మీ రాజ్య మహిమ గురించి వారు చెపుతారు మీ బలము గురించి మాట్లాడతారు,

  19. అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు.

  20. మీ రాజ్యం శాశ్వత రాజ్యం, మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది. యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.

  21. యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు, అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు.

  22. అందరి కళ్లు మీ వైపు చూస్తాయి, సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు.

  23. మీరు మీ గుప్పిలి విప్పి జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.

  24. యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు. ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు.

  25. ఆయనకు మొరపెట్టు వారందరికి, నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.