God
God ను ప్రస్తావించే వచనాలు
భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.
ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వారి నాశనానికి దారితీస్తుంది, వారి హృదయంలో వారికి యెహోవా మీద కోపం వస్తుంది.
ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.
బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.
ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును.
తప్పుడు తూనిక రాళ్లు తప్పుడు త్రాసులు, ఈ రెండును యెహోవాకు అసహ్యం.
వినుటకు చెవి చూచుటకు కన్ను ఈ రెండును యెహోవా కలుగజేసినవే.
కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు, యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు.
మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం, దొంగత్రాసు ఆయనకు అయిష్టం.
ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా, అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు?
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది.
యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.
ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు, కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు.
మనం బలులు అర్పించడం కంటే మనం సరియైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఎక్కువ ఇష్టము.
నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి, దుష్టులను నాశనం చేస్తాడు.
యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.
యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి, కాని విజయం యెహోవా దగ్గర ఉంది.
ధనికులు పేదవారు దీనిని సాధారణంగా కలిగి ఉంటారు: వారందరిని కలుగజేసినవాడు యెహోవా.
యెహోవాయందలి భయం వినయం; ఐశ్వర్యం గౌరవం దీర్ఘాయువు దాని వేతనాలు.
యెహోవా కళ్లు తెలివిని గమనిస్తూ ఉంటాయి, కాని విశ్వాసం లేనివారి మాటలను ఆయన నిరాశపరుస్తారు.
వ్యభిచార స్త్రీ నోరు ఒక లోతైన గుంట; యెహోవా ఉగ్రత క్రింద ఉన్నవాడు దానిలో పడతాడు.
మీ నమ్మకం యెహోవా మీద ఉండాలని, నేను ఈ రోజున వీటిని మీకు, మీకే బోధిస్తున్నాను.
యెహోవా వారి వైపున వాదిస్తారు ఎవరైనా వారిని పతనం చేసేవారిని ఆయన పతనం చేస్తారు.
పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.