కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.

  2. విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.

  3. మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు.

  4. మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు.

  5. యెహోవా, నేను బాధలో ఉన్నాను నన్ను కరుణించండి; నా కళ్లు విచారంతో బలహీనం అవుతున్నాయి, నా ప్రాణం దేహం దుఃఖంతో క్షీణిస్తున్నాయి.

  6. కాని యెహోవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; “మీరే నా దేవుడు” అని నేను చెప్తాను.

  7. నా బ్రతుకంతా మీ చేతిలోనే ఉంది; నన్ను వెంటాడే వారి నుండి, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపించండి.

  8. మీ దాసుని మీద మీ ముఖకాంతిని ప్రకాశించనీయండి; మీ మారని ప్రేమతో నన్ను రక్షించండి.

  9. యెహోవా, నేను మీకు మొరపెట్టాను, నన్ను సిగ్గుపడనీయకండి; అయితే దుష్టులు అవమానపరచబడాలి వారు పాతాళంలో మౌనంగా ఉండాలి.

  10. మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది!

  11. మనుష్యుల కుట్రలకు గురికాకుండ మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; నిందించే నాలుకల నుండి తప్పించి వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు.

  12. యెహోవాకు స్తుతి, ఎందుకంటే ముట్టడించబడిన పట్టణంలో నేను ఉన్నప్పుడు తన మార్పుచెందని ప్రేమలోని అద్భుతాలను ఆయన నాకు చూపించారు.

  13. “మీ దృష్టి నుండి తొలగించబడ్డాను” అని నేను ఆందోళన చెందాను. సాయం చేయమనే ప్రాధేయపడి వేడుకున్నప్పుడు నా విన్నపాన్ని విన్నారు.

  14. యెహోవా భక్తులారా, ఆయనను ప్రేమించండి. యెహోవాను నమ్మినవారిని ఆయన కాపాడతారు. గర్విష్ఠులకు గొప్ప ప్రతీకారం చేస్తారు.

  15. యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి.

  16. యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.

  17. రాత్రింబగళ్ళు మీ చేయి నాపై భారంగా ఉంది; వేసవిలో నీరు ఎండిపోయినట్లు నాలో సారం యింకి పోయింది. సెలా

  18. అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను నా దోషాన్ని నేను దాచుకోలేదు. “యెహోవా ఎదుట నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను. అప్పుడు నా అతిక్రమాన్ని మీరు క్షమించారు. సెలా

  19. మీరు దొరికే సమయంలోనే నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక; జలప్రవాహాలు ఉప్పొంగినా వారిని చేరవు.

  20. నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా

  21. మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను; మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.

  22. దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి, కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.

  23. నీతిమంతులారా యెహోవాలో ఆనందించి సంతోషించండి. యథార్థ హృదయులారా, మీరు పాడండి.

  24. నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి; ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది.

  25. సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి.