God
God ను ప్రస్తావించే వచనాలు
యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి.
వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు; వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది.
తమ తప్పిదాలను ఎవరు తెలుసుకోగలరు? నేను దాచిన తప్పులను క్షమించండి.
కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి; అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి. అప్పుడు నేను యథార్థవంతుడనై ఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను.
యెహోవా, నా కొండ, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.
యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి.
యెహోవా తన అభిషిక్తునికి విజయాన్ని ఇస్తారని ఇప్పుడు నాకు తెలిసింది. రక్షణ కలిగించే తన కుడిచేతి మహాబలంతో ఆయన తన పరలోకపు పరిశుద్ధాలయం నుండి అతనికి జవాబిస్తారు.
కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు, కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము.
యెహోవా, రాజుకు విజయం ఇవ్వండి! మేము మొరపెట్టినప్పుడు మాకు జవాబివ్వండి!
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు. మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!
మీరు అతనిని గొప్పగా ఆశీర్వదించారు మేలిమి బంగారు కిరీటం అతని తలపై పెట్టారు.
అతడు మిమ్మల్ని ఆయుష్షును అడుగగా, మీరు అతనికి శాశ్వతకాలం ఉండే దీర్ఘాయువును ఇచ్చారు.
మీరు ఇచ్చిన విజయాల వలన అతని గొప్ప కీర్తి కలిగింది; మీరు ఘనతా ప్రభావాలతో అతడిని అలంకరించారు.
నిశ్చయంగా మీరు అతనికి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చారు మీ సన్నిధిలోని ఆనందంతో అతన్ని సంతోష పెట్టారు.
రాజు యెహోవాను నమ్ముతాడు; మహోన్నతుని మారని ప్రేమను బట్టి అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు.
మీ చేయి మీ శత్రువులందరినీ పట్టుకుంటుంది; మీ కుడిచేయి మీ శత్రువులను ఆక్రమిస్తుంది.
మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు, మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు. యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు, ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది.
భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు, నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు.
వారు మీకు వ్యతిరేకంగా కీడు చేయాలని కుట్రపన్నినా దుష్ట పన్నాగాలు వేసినా, వారు విజయం సాధించలేరు.
మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు.
యెహోవా, మీ బలంలో మీరు లేవండి; మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము.
సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన నా దేవా, నా దేవా! నన్ను ఎందుకు విడిచిపెట్టారు? నన్ను రక్షించకుండ ఎందుకంత దూరంగా ఉన్నారు, వేదనతో కూడిన నా మొరలకు ఎందుకు దూరంగా ఉన్నారు?
నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, కాని మీరు జవాబివ్వడం లేదు, రాత్రి నేను మౌనంగా ఉండడం లేదు.
మీరు పరిశుద్ధులు; ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనులై ఉన్నారు.