God
God ను ప్రస్తావించే వచనాలు
మా పూర్వికులు మిమ్మల్ని విశ్వసించారు; వారి నమ్మకాన్ని బట్టి మీరు వారిని విడిపించారు.
వారు మీకు మొరపెట్టి విడుదల పొందారు; మీపట్ల వారు నమ్మకముంచి సిగ్గుపడలేదు.
“వాడు యెహోవాను నమ్మాడు, యెహోవా వాన్ని విడిపించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తాడు కాబట్టి, ఆయనే వాన్ని విడిపించనివ్వండి” అని వారంటున్నారు.
నా తల్లి గర్భం నుండి మీరే నన్ను బయటకు తెచ్చారు; నా తల్లి రొమ్మున ఉన్నప్పుడే మీపై నమ్మకం పుట్టించారు.
నేను పుట్టినప్పుడే మీమీద ఆధారపడ్డాను; నా తల్లి గర్భంలో ఉన్నప్పటినుండే మీరే నా దేవుడు.
నా బలం ఎండిన కుండపెంకులా అయింది, నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది; మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు.
అయితే, యెహోవా మీరు నాకు దూరంగా ఉండకండి. మీరే నాకు బలం; నాకు సాయం చేయడానికి త్వరగా రండి.
సింహాల నోటి నుండి నన్ను కాపాడండి; అడవి దున్నల కొమ్ముల నుండి నన్ను విడిపించండి.
నేను మీ నామాన్ని నా ప్రజలకు ప్రకటిస్తాను; సమాజంలో మిమ్మల్ని స్తుతిస్తాను.
యెహోవాకు భయపడేవారలారా, ఆయనను స్తుతించండి. యాకోబు సర్వ వంశస్థులారా, ఆయనను ఘనపరచండి! ఇశ్రాయేలు సర్వ వంశస్థులారా, ఆయనను పూజించండి.
బాధితుల శ్రమను ఆయన తృణీకరించలేదు వారిని చూసి అసహ్యపడలేదు; ఆయన ముఖం వారి నుండి దాచలేదు. ఆయన వారి మొర ఆలకించారు.
మహా సమాజంలో మీకే నేను స్తుతి చెల్లిస్తాను; మీకు భయపడు వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెలిస్తాను.
దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.
భూనివాసులందరూ యెహోవాను జ్ఞాపకం చేసుకుని ఆయన వైపు తిరుగుతారు, దేశాల్లోని కుటుంబాలన్నీ ఆయనకు నమస్కారం చేస్తాయి.
రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు.
లోకంలోని ధనికులంతా విందు చేస్తూ ఆరాధిస్తారు; తమ ప్రాణాలు కాపాడుకోలేక మట్టిలో కలిసిపోయే వారంతా ఆయన ఎదుట మోకరిస్తారు.
ఒక తరం వారు ఆయనను సేవిస్తారు; రాబోయే తరాలకు ప్రభువు గురించి చెబుతారు.
వారు వచ్చి ఆయన చేసిన కార్యాల గురించి, ఇంకా పుట్టని ప్రజలకు చెప్పి ఆయన నీతిని తెలియజేస్తారు!
దావీదు కీర్తన యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.
పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.
ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు. ఆయన తన నామం కోసం నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.
మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి.
నా శత్రువులు ఉన్న చోటనే మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు. నూనెతో నా తల అభిషేకించారు; నా పాత్ర నిండి పొర్లుతుంది.
నిశ్చయంగా నా జీవితకాలమంతా మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి. నేను నిరంతరం యెహోవా మందిరంలో నివసిస్తాను.
దావీదు కీర్తన. భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.