కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సరే, ఒక తంతివాద్యం వాయించేవాన్ని నా దగ్గరకు తీసుకురా.” తంతివాద్యం వాయించేవాడు వాయిస్తూ ఉన్నప్పుడు, యెహోవా హస్తం ఎలీషా మీదికి వచ్చింది.

  2. అప్పుడతడు, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ లోయను నీటి గుంటలతో నింపుతాను.

  3. ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: గాలి గాని వాన గాని మీరు చూడరు, అయినా నీళ్ల గుంటలతో ఈ లోయ నిండిపోతుంది. మీరు మీ మందలు ఇతర జంతువులు త్రాగడానికి నీళ్లు ఉంటాయి.

  4. యెహోవా దృష్టికి ఇది తేలికైన పని; ఆయన మోయాబును కూడ మీ చేతులకు అప్పగిస్తారు.

  5. ఒక రోజు ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, “మీ సేవకుడైన నా భర్త చనిపోయాడు, అతడు యెహోవా పట్ల భక్తి కలవాడని మీకు తెలుసు. అయితే ఇప్పుడు అతనికి అప్పిచ్చినవాడు నా ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకెళ్లడానికి వస్తున్నాడు” అని మొరపెట్టింది.

  6. ఆమె వెళ్లి దైవజనునికి చెప్పగా అతడు, “వెళ్లు, ఆ నూనె అమ్మి, నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో నీవు, నీ కుమారులు జీవనం కొనసాగించండి” అన్నాడు.

  7. ఆమె తన భర్తతో, “మన దారిలో వస్తూ వెళ్తూ ఉండే ఈ మనిషి పరిశుద్ధుడైన దైవజనుడని నాకు తెలుసు.

  8. అప్పుడు ఎలీషా, “వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు” అని చెప్పాడు. అందుకామె, “వద్దు, నా ప్రభువా! దయచేసి, దైవజనుడా, మీ సేవకురాలితో అబద్ధం చెప్పకండి!” అని అన్నది.

  9. ఆమె బాలున్ని తీసుకెళ్లి దైవజనుడైన ఎలీషా మంచం మీద పడుకోబెట్టి తలుపు మూసి బయటకు వెళ్లింది.

  10. ఆమె తన భర్తను పిలిచి, “దయచేసి నా కోసం ఒక పనివాన్ని ఒక గాడిదను పంపించండి, నేను తొందరగా దైవజనుని దగ్గరకు వెళ్లి రావాలి” అని అన్నది.

  11. కాబట్టి ఆమె బయలుదేరి కర్మెలు పర్వతం మీద ఉన్న దైవజనుని దగ్గరకు వచ్చింది. ఆమెను దూరం నుండి చూసి, ఆ దైవజనుడు తన సేవకుడైన గేహజీతో, “చూడు! అదిగో షూనేమీయురాలు!

  12. ఆమె పర్వతం మీద ఉన్న దైవజనుని చేరుకొని, అతని పాదాలు పట్టుకుంది. గేహజీ ఆమెను అవతలకు నెట్టాలని దగ్గరకు వచ్చాడు, కాని దైవజనుడు, “ఆమెను వదిలేయి! ఆమె వేదనతో ఉన్నది కాని యెహోవా ఈ విషయం నాకు చెప్పకుండా మరుగు చేశారు” అని అన్నాడు.

  13. అయితే ఆ బాలుని తల్లి, “సజీవుడైన యెహోవా మీద, మీమీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను మిమ్మల్ని విడిచిపెట్టను” అన్నది. కాబట్టి అతడు లేచి ఆమె వెంట వెళ్లాడు.

  14. అతడు గదిలోకి వెళ్లి వారిద్దరే లోపల ఉండగా తలుపు మూసి యెహోవాకు ప్రార్థన చేశాడు.

  15. ఆ కూరను తినడానికి అక్కడ వారికి వడ్డించారు. వారు దానిని రుచి చూసి, “దైవజనుడా! కుండలో విషం ఉంది!” అని కేకలు పెట్టారు. వారు దానిని తినలేకపోయారు.

  16. ఒక రోజు ఓ వ్యక్తి బయల్-షాలిషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ, ఒక సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలు, క్రొత్త ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. అయితే ఎలీషా, “ప్రజలకు తినడానికి ఇవ్వు” అని చెప్పాడు.

  17. అయితే అతని సేవకుడు, “దీన్ని వందమందికి ఎలా పెట్టగలను?” అని అడిగాడు. అందుకు ఎలీషా, “ ‘వారు తినగా ఇంకా మిగలుతుంది’ అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు” అని అన్నాడు.

  18. అప్పుడు అతడు వారికి వడ్డించాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరు తినగా కొంత మిగిలింది.

  19. అరాము రాజు సైన్యాధిపతి నయమాను. అతడు తన యజమాని దృష్టిలో గొప్పవాడు, గౌరవనీయుడు, ఎందుకంటే యెహోవా అతని చేత అరామీయులకు విజయం ప్రసాదించారు. అతడు మహాశూరుడు, కానీ కుష్ఠురోగి.

  20. ఆమె తన యజమానురాలితో, “నా యజమాని సమరయలో ఉన్న ప్రవక్తను కలిస్తే బాగుండేది! ఆయన అతని కుష్ఠురోగాన్ని పూర్తిగా నయం చేస్తాడు” అని చెప్పింది.

  21. ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే తన బట్టలు చింపుకొని, “చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడనా? కుష్ఠును బాగుచేయాలని ఇతడు ఒక వ్యక్తిని నా దగ్గరకు ఎందుకు పంపాడు? ఇతడు నాతో ఎలా వాదం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి!” అన్నాడు.

  22. దైవజనుడైన ఎలీషా, ఇశ్రాయేలు రాజు తన బట్టలు చించుకొన్నాడని విన్నప్పుడు, ఈ సందేశం అతనికి పంపాడు: “నీ బట్టలు ఎందుకు చించుకొన్నావు? ఆ వ్యక్తిని ఇప్పుడు నా దగ్గరకు పంపు, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతడు తెలుసుకుంటాడు.”

  23. అయితే నయమాను కోపంతో వెళ్లి, “అతడు తప్పకుండా నా కోసం బయటకు వచ్చి, నిలబడి, అతని దేవుడైన యెహోవా పేరిట ప్రార్థనచేసి, తన చేయి రోగం ఉన్నచోట అల్లాడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను.

  24. కాబట్టి అతడు వెళ్లి దైవజనుడు చెప్పినట్లు యొర్దానులో ఏడుసార్లు మునిగాడు, వెంటనే అతని శరీరం శుద్ధి చేయబడి, పసివాడి దేహంలా మారింది.

  25. అప్పుడు నయమాను, అతని సేవకులందరు దైవజనుని దగ్గరకు తిరిగి వెళ్లారు. నయమాను అతని ఎదుట నిలబడి, “ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరో దేవుడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీ దాసుడనైన నేను ఇచ్చే ఈ కానుక అంగీకరించండి.”