కంటెంట్‌కు వెళ్లండి

Years గురించి బైబిల్ వచనాలు

27 వచనాలు · 19 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి.

  2. ఆదాము 130 సంవత్సరాలు జీవించి తన పోలికలో తన స్వరూపంలో ఒక కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు.

  3. నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి.

  4. వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి.

  5. భూమి నుండి క్రమంగా నీరు తగ్గింది, నూట యాభై రోజుల తర్వాత నీరు తగ్గి,

  6. నోవహు యొక్క 601 వ సంవత్సరం మొదటి నెల మొదటి దినాన భూమి మీద నీళ్లు ఎండిపోయాయి. అప్పుడు నోవహు ఓడ కప్పు తెరిచి చూస్తే నేల ఆరిపోయి కనిపించింది.

  7. “ఈ భూమి ఉన్నంత కాలం, నాటే కాలం కోతకాలం, చలి వేడి, ఎండకాలం చలికాలం, పగలు రాత్రి, ఎప్పుడూ నిలిచిపోవు.”

  8. అబ్రాహాము నూట డెబ్బై సంవత్సరాలు జీవించాడు.

  9. అబ్రాహాము తన వృద్ధాప్యంలో, సంవత్సరాలు నిండిన వృద్ధునిగా తుది శ్వాస విడిచి చనిపోయాడు; తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు.

  10. “ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల.

  11. కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు.

  12. యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు.

  13. ఇది ఇశ్రాయేలీయుల కుటుంబ నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వివిధ విషయాల్లో రాజుకు సేవలందించే అధికారుల జాబితా. వీరిలో ప్రతి విభాగం సంవత్సరంలో ఒక నెల చొప్పున సేవ చేస్తారు. ఒక్కొక్క విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.

  14. యూదులు ప్రతి సంవత్సరం ఈ రెండు రోజులను ఒక ఆచారంగా నిర్ణయించిన విధానంలో నియమించిన సమయంలో తాము తమ వారసులు, తమతో కలిసే వారందరితో ఖచ్చితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

  15. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి: మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.

  16. యెహోవా ప్రతీకారం చేయడానికి ఒక రోజును, సీయోను పక్షంగా ప్రాయశ్చిత్తం చేసే ఒక సంవత్సరాన్ని నియమించారు.

  17. యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,

  18. అది నేను పగతీర్చుకునే రోజు; నేను విమోచించే సంవత్సరం వచ్చింది.

  19. అనాతోతు ప్రజలకు శిక్ష విధించే సంవత్సరంలో నేను వారికి విపత్తు తెస్తాను కాబట్టి వారికి మిగిలేది కూడా ఉండదు.”

  20. “కాబట్టి వారి దారి జారే నేలలా అవుతుంది; వారు చీకటిలోకి వెళ్లగొట్టబడతారు అక్కడ వారు పడిపోతారు. వారు శిక్షించబడే సంవత్సరంలో నేను వారి మీదికి విపత్తు రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  21. ఆ పరిపాలకుడు ఒక ‘ఏడు’ కోసం చాలా మందితో నిబంధన నెలకొల్పుతాడు. అయితే ఆ ‘ఏడు’ సగం గడిచాక, బలిని, నైవేద్యాన్ని నిలిపివేస్తాడు. అతని మీద శాసించబడిన అంతం కుమ్మరించబడేవరకు, మందిరం దగ్గర వినాశనం కలిగించే హేయమైన దానిని నిలుపుతాడు.”

  22. “అనుదిన నైవేద్యం నిలిపివేయడం, వినాశనం కలిగించే హేయమైనది స్థిరపరచబడడం జరిగే కాలం నుండి 1,290 రోజులు గడచిపోతాయి.

  23. ఎదురుచూస్తూ 1,335 రోజుల ముగింపు వరకు వేచి ఉండే మనిషి ధన్యుడు.

  24. అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.

  25. ప్రభువు హితవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించారు.”