Elisabeth
Elisabeth ను ప్రస్తావించే వచనాలు
యూదయదేశపు రాజైన హేరోదు రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు జెకర్యా; అతని భార్య అహరోను యాజక వంశీయురాలు, ఆమె పేరు ఎలీసబెతు.
అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.
ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి.
ఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది.
నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది.
అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది.
ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది.
ఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది.