Skip to content

Widow గురించి బైబిల్ వచనాలు

62 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసావు తండ్రిలేనివారి బలాన్ని అణగద్రొక్కావు.

  2. తండ్రిలేనివారి గాడిదను తోలుకుపోతారు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకెళ్తారు.

  3. వారు గొడ్రాళ్లను పిల్లలు కనని స్త్రీలను బాధితురాళ్లుగా చేస్తారు, విధవరాలి మీద దయ చూపరు.

  4. చనిపోబోతున్నవారు నన్ను దీవించారు; విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను.

  5. “ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా,

  6. అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక, దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక.

  7. తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.

  8. విధవరాండ్రను విదేశీయులను చంపేస్తారు; వారు తండ్రిలేనివారిని హత్య చేస్తారు.

  9. యెహోవా పరదేశీయులను కాపాడతారు. తండ్రిలేని అనాధ పిల్లలను, విధవరాండ్రను ఆదరిస్తారు. కాని దుష్టుల ప్రణాళికలను ఆయన వ్యతిరేకిస్తారు.

  10. గర్వించువారి ఇల్లు యెహోవా పెరికివేయును, భర్తలేని స్త్రీ పొలిమేరను ఆయన స్ధాపించును.

  11. సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.

  12. నీ పాలకులు తిరుగుబాటుదారులు, దొంగలతో సహవాసం చేస్తారు. వారందరికి లంచాలు ఇష్టం కానుకల వెంటపడతారు. తండ్రిలేనివారి పక్షంగా న్యాయం తీర్చరు. విధవరాలి సమస్యను పరిష్కరించరు.

  13. అన్యాయపు చట్టాలు చేసేవారికి, చెడు శాసనాలు చేసేవారికి శ్రమ.

  14. వారు పేదల హక్కులను హరిస్తారు, నా ప్రజల్లో అణచివేయబడిన వారికి న్యాయం చేరనివ్వరు వారు విధవరాండ్రను తమ దోపుడు సొమ్ముగా చేసుకుంటూ తండ్రిలేనివారిని దోచుకుంటారు.

  15. మీరు విదేశీయులను, తండ్రిలేనివారిని లేదా విధవరాండ్రను అణచివేయకుండ, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండ, మీకు హాని కలిగించే విధంగా ఇతర దేవుళ్ళను అనుసరించకుండా ఉంటే,

  16. నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను.

  17. యెహోవా ఇలా చెప్తున్నారు: నీతిన్యాయాల ప్రకారం చేయండి. అణచివేసే వారి చేతిలో నుండి దోపిడికి గురైన వారిని విడిపించండి. విదేశీయులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు ఎలాంటి అన్యాయం చేయవద్దు, హింసించవద్దు, ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించవద్దు.

  18. ‘తండ్రిలేని నీ పిల్లలను వదిలేయండి; నేను వారిని చూసుకుంటాను. నీ విధవరాండ్రు కూడా నన్ను నమ్ముకోవచ్చు’ అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు.”

  19. నీలో వారు తండ్రిని తల్లిని అవమానించారు; నీలో వారు పరదేశులను అణచివేశారు, తండ్రిలేనివారిని, విధవరాండ్రను చులకనగా చూశారు.

  20. విధవరాండ్రను తండ్రిలేనివారిని విదేశీయులను బీదలను హింసించకండి. ఒకరి మీద ఒకరు కుట్ర చేయకండి’ అని చెప్పింది.

  21. “తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నాకు భయపడక జీతాల విషయంలో కూలివారిని మోసం ఉద్యోగులను మోసం చేసేవారికి, విధవరాండ్రను అనాధలను అణచివేసే వారికి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు న్యాయం జరుగకుండ చేసేవారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.

  22. “వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు.

  23. వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.

  24. వారు విధవరాండ్ర గృహాలను దోచుకుంటూ, ప్రజల ముందు చూపించుకోడానికి ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తారు. ఇలాంటివారు తీవ్రంగా శిక్షింపబడతారు” అని చెప్పారు.

  25. అయితే ఆమె తన భర్త బ్రతికి ఉండగానే మరొక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటే ఆమె వ్యభిచారిణి అవుతుంది. ఒకవేళ ఆమె భర్త చనిపోతే ఆ ధర్మం నుండి ఆమె విడుదల పొందుకున్నది కాబట్టి ఆమె మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి కాదు.