కంటెంట్‌కు వెళ్లండి

Watchfulness గురించి బైబిల్ వచనాలు

167 వచనాలు · 28 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి.

  2. దేవుని కృపను పొందడంలో ఎవరు తప్పిపోకుండా, చేదైన వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచి అనేకమందిని అపవిత్రులుగా చేయకుండా జాగ్రత్తపడండి.

  3. మీ నాయకులపై నమ్మకం ఉంచండి, వారి అధికారానికి లోబడి ఉండండి, ఎందుకంటే వారు మీ ఆత్మలను గురించి లెక్క అప్పగించాల్సిన వారుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే, మీకు ఏ ప్రయోజనం ఉండదు, కాబట్టి వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా చూడండి.

  4. కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి.

  5. పక్షపాతం లేకుండా ప్రతివారికి వారి వారి పనిని బట్టి తీర్పు తీర్చే దేవున్ని మీరు తండ్రీ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ లోకంలో విదేశీయులుగా మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి.

  6. అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.

  7. మెలకువతో జాగరూకులై ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించు సింహంలా తిరుగుతూ ఎవరినైన మ్రింగివేయాలని చూస్తున్నాడు.

  8. మరింత నమ్మకమైన ప్రవచనాత్మక సందేశం మనకు ఉంది. ఉదయకాలపు వేకువచుక్క మీ హృదయాలను వెలుగుతో నింపే వరకు చీకటిలో వెలుగుతున్న దీపంలా ఉన్న ఆ సందేశాన్ని శ్రద్ధతో ఆలకించడం మీకు మంచిది.

  9. కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.

  10. దేవుని మూలంగా పుట్టిన వారెవరు పాపం కొనసాగించలేరని మనకు తెలుసు; దేవుని మూలంగా పుట్టిన వారు తమను తాము భద్రం చేసుకుంటారు, కాబట్టి దుష్టుడు వారిని ముట్టలేడు.

  11. మనం ఇంతవరకు దేనికోసం పని చేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానాన్ని సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.

  12. కాని, ప్రియ మిత్రులారా, అతిపరిశుద్ధమైన మీ విశ్వాసంలో మిమ్మల్ని మీరు బలపరచుకొంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ,

  13. మీకు నిత్యజీవాన్ని దయచేసే మన ప్రభువైన యేసు క్రీస్తు కనికరం కోసం మీరు ఎదురుచూస్తూ ఉంటూ మీరు దేవుని ప్రేమలో నిలిచి ఉండండి.

  14. మేల్కో! నా దేవుని దృష్టిలో నీ క్రియలు సంపూర్తి అయినట్లు నాకు కనిపించలేదు కాబట్టి చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచు.

  15. కాబట్టి నీవు పొందిన వాటిని విన్నవాటిని జ్ఞాపకం చేసుకుని, వాటిని పాటిస్తూ గట్టిగా పట్టుకుని పశ్చాత్తాపపడు. కాని నీవు మేలుకోక పోతే నేను దొంగలా వస్తాను, నేను ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు తెలియదు.

  16. నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి ఎవరు నీ కిరీటాన్ని తీసుకోకుండా నీవు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో.

  17. “ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”