Waiting Upon God గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను.
అతనికి ఇద్దరు భార్యలు; ఒకరు హన్నా మరొకరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు.
మీ కోసం ఎదురు చూసే వారెవరూ ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు, కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు అవమానం వస్తుంది.
మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి, మీరే నా రక్షకుడవైన నా దేవుడవు, మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.
నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది, కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.
యెహోవా కోసం కనిపెట్టండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి యెహోవా కోసం కనిపెట్టండి.
మనం నిరీక్షణ కలిగి యెహోవా కోసం వేచి ఉందాం; మనకు సహాయం మనకు డాలు ఆయనే.
యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.
చెడ్డవారు నాశనం చేయబడతారు, కాని యెహోవా కోసం నిరీక్షించే వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
“కాని ప్రభువా, ఇప్పుడు నేను దేనికోసం చూస్తున్నాను? మీలోనే నా నిరీక్షణ.
నా అతిక్రమాలన్నిటి నుండి నన్ను విడిపించండి; మూర్ఖులు ఎగతాళి చేయడానికి నన్ను లక్ష్యంగా చేయకండి.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.
మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను.
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. ఒక మిక్తము. దావీదును చంపడానికి సౌలు పంపినవారు అతని ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు వ్రాసినది. దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.
కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి.
నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి! యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు.
నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!
సైన్యాల యెహోవా దేవా, ఇశ్రాయేలు దేవా! సర్వ దేశాలను శిక్షించడానికి లేవండి; దుష్టులైన దేశద్రోహులకు దయ చూపకండి. సెలా
వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.
వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి; వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి, “మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు.
కాని యెహోవా! మీరు వారిని చూసి నవ్వుతారు; ఆ దేశాలన్నిటిని చూసి, పరిహసిస్తారు.
మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; దేవా, మీరు, నాకు ఎత్తైన కోట,
తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు. ఆయన నాకు ముందుగా వెళ్తారు నన్ను అపవాదు చేసిన వారిపై నేను సంతోషించేలా చేస్తారు.
సంగీత దర్శకునికి. యెదూతూను అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన. నేను దేవునిలోనే విశ్రాంతి పొందుతాను; ఆయన నుండి నాకు రక్షణ కలుగుతుంది.
ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.