కంటెంట్‌కు వెళ్లండి

Waiting Upon God గురించి బైబిల్ వచనాలు: Should be done especially in adversity

10 వచనాలు · 68 కోణాలు

"Waiting Upon God" కోసం వెతకండి

Should be done especially in adversity గురించి వచనాలు

  1. సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. ఒక మిక్తము. దావీదును చంపడానికి సౌలు పంపినవారు అతని ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు వ్రాసినది. దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.

  2. కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి.

  3. నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి! యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు.

  4. నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!

  5. సైన్యాల యెహోవా దేవా, ఇశ్రాయేలు దేవా! సర్వ దేశాలను శిక్షించడానికి లేవండి; దుష్టులైన దేశద్రోహులకు దయ చూపకండి. సెలా

  6. వారు సాయంకాలం మళ్ళీ వస్తారు, కుక్కల్లా మొరుగుతూ, వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.

  7. వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి; వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి, “మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు.

  8. కాని యెహోవా! మీరు వారిని చూసి నవ్వుతారు; ఆ దేశాలన్నిటిని చూసి, పరిహసిస్తారు.

  9. మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను; దేవా, మీరు, నాకు ఎత్తైన కోట,

  10. యాకోబు వారసుల నుండి తన ముఖాన్ని దాస్తున్న యెహోవా కోసం నేను ఎదురుచూస్తాను. ఆయనపై నా నమ్మకాన్ని ఉంచుతాను.