కంటెంట్‌కు వెళ్లండి

Union With Christ గురించి బైబిల్ వచనాలు

74 వచనాలు · 41 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.

  2. ఎందుకంటే, “ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు? ఆయనకు బోధింప గలవారెవరు?” మనమైతే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాము.

  3. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను తెలివైన నిర్మాణకునిగా పునాది వేశాను. అలాగే మరొకరు దాని మీద కడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కట్టాలి.

  4. ఎందుకంటే అప్పటికే వేయబడిన పునాది తప్ప మరొకటి ఎవరూ వేయలేరు, ఆ పునాది యేసు క్రీస్తే.

  5. అయితే ప్రభువుతో ఏకమైనవారు ఆత్మలో ఆయనతో ఒక్కటై ఉంటారు.

  6. మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకోవడమే కదా? మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో పాలుపంచుకోవడమే కదా?

  7. మనమందరం ఆ ఒకే రొట్టెను పంచుకుంటున్నాం, రొట్టె ఒక్కటే కాబట్టి అనేకులమైన మనం ఒకే శరీరంగా ఉన్నాము.

  8. ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు.

  9. కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే.

  10. కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతవి గతించాయి, క్రొత్తవి మొదలయ్యాయి!

  11. మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.

  12. క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు పద్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడా లేక శరీరం లేకుండా కొనిపోబడ్డాడా అనేది నాకు తెలియదు; అది దేవునికే తెలుసు.

  13. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.

  14. దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచి, సమస్తానికి పైన సంఘానికి ఆయనను శిరస్సుగా నియమించారు.

  15. సంఘం అనగా ఆయన శరీరం; సమస్తాన్ని పూర్తిగా నింపుతున్న ఆయన యొక్క పరిపూర్ణత.

  16. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.

  17. ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధాలయంగా వృద్ధిపొందుతూ ఉంది.

  18. అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని,

  19. ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము.

  20. ఆయన సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతీ అవయవం దాని పనిని చేస్తుండగా, ప్రతి కీలు సహాయంతో ఒకటిగా అతుకబడి ప్రేమలో తనకు అభివృద్ధి కలుగునట్లు శరీరాన్ని వృద్ధి చేసుకుంటుంది.

  21. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి.

  22. క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి,

  23. దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.

  24. అదే విధంగా భర్తలు తమ సొంత శరీరాన్ని ప్రేమించినట్లే తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడు.

  25. ఎవరూ కూడా తన సొంత శరీరాన్ని ద్వేషించరు, ప్రతివారు దానిని పోషించి, కాపాడుకుంటారు, అదే విధంగా క్రీస్తు సంఘాన్ని పోషించి కాపాడుతున్నారు.