కంటెంట్‌కు వెళ్లండి

Union With Christ గురించి బైబిల్ వచనాలు: Have, in his death

7 వచనాలు · 41 కోణాలు

Have, in his death గురించి వచనాలు

  1. క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలో కూడా బాప్తిస్మం పొందామని మీకు తెలియదా?

  2. తండ్రియైన దేవుని మహిమ ద్వారా మరణం నుండి తిరిగి సజీవంగా లేచిన క్రీస్తువలె మనం కూడా నూతన జీవాన్ని జీవించడానికి ఆయన మరణంలో బాప్తిస్మం పొందిన మనం ఆయనతో పాటు పాతిపెట్టబడ్డాము.

  3. మనం కూడా ఆయన మరణం విషయంలో ఆయనతో ఐక్యమైతే, ఖచ్చితంగా మనం కూడా ఆయన పునరుత్థానం విషయంలో ఆయనతో ఐక్యమవుతాము.

  4. మనమింక పాపానికి బానిసలుగా ఉండకుండా పాపం చేత పాలించబడిన శరీరం నశించేలా, మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడిందని మనకు తెలుసు.

  5. ఎందుకంటే, మరణించినవారు పాపం నుండి విడుదల పొందారు.

  6. కాబట్టి మనం క్రీస్తుతో పాటు మరణిస్తే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.

  7. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.