కంటెంట్‌కు వెళ్లండి

Tribe Of Benjamin గురించి బైబిల్ వచనాలు

107 వచనాలు · 35 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా ఇశ్రాయేలీయుల చేతిలో బెన్యామీనీయులను ఓడించారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు 25,100 మంది బెన్యామీనీయులను చంపారు. వారంతా కత్తి పట్టినవారే.

  2. అప్పుడు తాము ఓటమి పాలయ్యామని బెన్యామీనీయులు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు దారి ఇచ్చారు.

  3. మాటులో ఉన్నవారు గిబియాలో అకస్మాత్తుగా చొరబడి వారు పట్టణంలోని వారందరిని ఖడ్గంతో చంపారు.

  4. పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయాలని మాటున దాక్కున్న వారికి ఇశ్రాయేలీయులకు మధ్య సంకేతం ఏర్పాటు చేసుకున్నారు,

  5. అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి యుద్ధం చేశారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులకు (దాదాపు ముప్పైమందిని) ప్రాణనష్టం కలిగిస్తూ, “మొదటి యుద్ధంలా మనం వారిని ఓడిస్తున్నాం” అని అన్నారు.

  6. అయితే పట్టణంలో నుండి పొగ పైకి లేవడం ఆరంభమైనప్పుడు, బెన్యామీనీయులు పట్టణమంతా ఆకాశం వైపు వెళ్తున్న పొగను చూశారు.

  7. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదురు దాడి చేశారు, విపత్తు తమను సమీపించిందని తెలుసుకొని బెన్యామీనీయులు హడలిపోయారు.

  8. కాబట్టి వారు ఇశ్రాయేలీయుల నుండి అరణ్యం వైపు పారిపోయారు, కానీ వారు యుద్ధం తప్పించుకోలేకపోయారు. పట్టణాల్లో నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు వారిని అక్కడ హతం చేశారు.

  9. వారు బెన్యామీనీయులను చట్టుముట్టి ఆగకుండా వారిని తరిమి గిబియాకు తూర్పుదిక్కు ప్రాంతం దగ్గర ఓడించారు.

  10. పద్దెనిమిది వేలమంది బెన్యామీనీయులు పడిపోయారు, వారంతా యుద్ధవీరులు.

  11. మిగిలిన వారు అరణ్యం వైపు, రిమ్మోను బండ వైపు పారిపోతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు రహదారుల వెంట అయిదువేల మందిని హతం చేశారు. వారింకా బెన్యామీనీయులను గిదోము వరకు తరుముతూ ఇంకొక రెండువేలమందిని హతం చేశారు.

  12. ఆ రోజు ఇరవై అయిదువేల బెన్యామీనీయులు కూలారు. వారంతా యుద్ధవీరులు.

  13. అయితే వారిలో ఆరువందలమంది మాత్రం తప్పించుకు వెళ్లి అరణ్యంలో ఉన్న రిమ్మోను బండ దగ్గరకు పారిపోయి అక్కడ నాలుగు నెలలు ఉండిపోయారు.

  14. ఇశ్రాయేలీయులు బెన్యామీను ప్రదేశానికి తిరగి వెళ్లి పట్టణాల మీద పడి పశువులను, కనిపించిన దాన్నంతా ఖడ్గంతో హతం చేశారు. వారికి కనబడిన ప్రతి పట్టణాన్ని తగుల బెట్టారు.

  15. ఇశ్రాయేలీయులు మిస్పాలో, “మనలో ఎవ్వరూ బెన్యామీనీయులకు తమ కుమార్తెలను పెళ్ళికి ఇవ్వకూడదు” అని ప్రమాణం చేసుకున్నారు.

  16. ప్రజలు బేతేలుకు వెళ్లి అక్కడ సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతగానో ఏడ్చారు.

  17. “యెహోవా! ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలుకు ఇలా ఎందుకు జరిగింది? ఈ రోజు ఇశ్రాయేలు గోత్రాల్లో ఎందుకని ఒక గోత్రం అంతరించిపోవలసి వచ్చింది?” అంటూ ఏడ్చారు.

  18. మరుసటిరోజు ప్రొద్దున్నే వారు ఒక బలిపఠం కట్టి దాని మీద దహనబలులు, సమాధానబలులు అర్పించారు.

  19. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు.

  20. అప్పుడు వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీను గోత్రం గురించి బాధపడుతూ, “ఇశ్రాయేలులో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయింది.

  21. వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.

  22. తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.

  23. ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.

  24. అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు.

  25. వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.