Tribe Of Benjamin గురించి బైబిల్ వచనాలు: Very numerous in David's time
Very numerous in David's time గురించి వచనాలు
బెన్యామీనుకు కుమారులు ముగ్గురు: బేల, బెకెరు, యెదీయవేలు.
బేల కుమారులు: ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు, ఈరీ మొత్తం అయిదుగురు. వీరు కుటుంబ పెద్దలు. తమ వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 22,034.
బెకెరు కుమారులు: జెమీరా, యోవాషు, ఎలీయెజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, ఆలెమెతు. వీరందరు బెకెరు కుమారులు.
తమ వంశావళి ప్రకారం వీరు కుటుంబ పెద్దలు; యుద్ధవీరుల సంఖ్య 20,200.
యెదీయవేలు కుమారుడు: బిల్హాను. బిల్హాను కుమారులు: యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు.
యెదీయవేలు కుమారులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు. వీరిలో యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యుద్ధవీరుల సంఖ్య 17,200.
ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు.