Tribe Of Benjamin గురించి బైబిల్ వచనాలు: Furnished the first king to Israel
Furnished the first king to Israel గురించి వచనాలు
సౌలు రావడానికి ఒక రోజు ముందే యెహోవా సమూయేలుకు,
“రేపు ఈ సమయానికి బెన్యామీను ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తాను. అతన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా అభిషేకించు; నా ప్రజల మొర నాకు విని వారివైపు చూశాను. అతడే వారిని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తాడు” అని చెప్పారు.
సౌలు సమూయేలుకు కనబడగానే యెహోవా అతనితో, “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి; ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని చెప్పారు.
ఆ సమయంలో, నేరు కుమారుడును సౌలు సేనాధిపతియైన అబ్నేరు అనేవాడు సౌలు కుమారుడైన ఇష్-బోషెతును మహనయీముకు తీసుకెళ్లాడు.
అతన్ని గిలాదు, అషూరీ, యెజ్రెయేలు, ఎఫ్రాయిం బెన్యామీను, ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా చేశాడు.
సౌలు కుమారుడైన ఇష్-బోషెతు ఇశ్రాయేలుకు రాజైనప్పుడు అతని వయస్సు నలభై సంవత్సరాలు, అతడు రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదా ప్రజలు నమ్మకంగా దావీదు పక్షం ఉన్నారు.