The Tribe Of Asher గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
పదకొండవ రోజు అర్పణను తెచ్చిన వారు ఆషేరు గోత్ర నాయకుడు, ఒక్రాను కుమారుడైన పగీయేలు.
అతని అర్పణ: పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నూట ముప్పై షెకెళ్ళ బరువు ఉన్న వెండి పళ్ళెం, డెబ్బై షెకెళ్ళ బరువు ఉన్న వెండి చిలకరింపు పాత్ర, భోజనార్పణ కోసం ఈ రెండింటి నిండా ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండి;
ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
పాపపరిహారబలి కోసం మేకపోతు;
సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; బెరీయా ద్వార, బెరీయుల వంశం;
బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము.
ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.
ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400.
అయిదవ చీటి వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రానికి వచ్చింది.
వారి సరిహద్దులో హెల్కతు, హలి, బెతెను, అక్షఫు,
అలమ్మేలెకు, అమాదు, మిషాలు ఉన్నాయి. పడమరగా ఆ సరిహద్దు కర్మెలు షీహోర్ లిబ్నాతు వరకు ఉంది.
అది తూర్పున బేత్-దాగోను వైపు తిరిగి, జెబూలూను, ఇఫ్తా ఎల్ లోయను తాకి, ఉత్తరాన బేత్-ఎమెకు, నెయీయేలులకు వెళ్లి ఎడమవైపున కాబూల్ దాటింది.
అది మహా సీదోను వరకు అబ్దోను, రెహోబు, హమ్మోను, కానా వరకు వెళ్లింది.
ఆ సరిహద్దు రామా వైపు తిరిగి, కోటగోడలు గల పట్టణమైన తూరుకు వెళ్లి, హోసా వైపు తిరిగి, అక్సీబు ప్రాంతంలోని మధ్యధరా సముద్రం దగ్గరకు వచ్చింది.
ఉమ్మా, ఆఫెకు, రెహోబు కూడా వారి ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఇరవై రెండు పట్టణాలు, వాటి గ్రామాలు.
ఈ పట్టణాలు వాటి గ్రామాలు ఆషేరు గోత్రానికి వారి వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.
ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు.
బెరీయా కుమారులు: హెబెరు, బిర్జాయీతు తండ్రియైన మల్కీయేలు.
హెబెరు యప్లేటు, షోమేరు, హోతాము, వారి సోదరియైన షూయాలకు తండ్రి.
యప్లేటు కుమారులు: పాసకు, బింహాలు, అష్వాతు.
షోమేరు కుమారులు: అహీ, రోగా, యెహుబ్బా, అరాము.
అతని సోదరుడైన హేలెము కుమారులు: జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.
జోపహు కుమారులు: సూయ, హర్నెఫెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,