- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
The Second Temple గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “యెహోవాకు మందిరాన్ని మరలా కట్టడానికి సమయమింకా రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”
అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా చెప్పింది ఏంటంటే:
“ఈ మందిరం పాడైపోయి ఉండగా మీరు చెక్క పలకలతో కప్పిన మీ ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా?”
కాబట్టి సైన్యాల యెహోవా చెబుతున్న మాట ఇదే: “మీ ప్రవర్తన గురించి బాగా ఆలోచించుకోండి.
మీరు విస్తారంగా విత్తినా కానీ పండింది కొంచెమే. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరడం లేదు. మీరు త్రాగుతున్నారు కానీ మత్తు ఎక్కడం లేదు. బట్టలు కప్పుకున్నా వెచ్చగా లేదు. మీరు జీతం సంపాదిస్తున్నా అది చిల్లు సంచిలో వేసినట్లే ఉంటుంది.”
పర్వతాల పైకి వెళ్లి కలపను తీసుకువచ్చి నా మందిరాన్ని కట్టండి, అప్పుడు నేను దానిలో ఆనందించి ఘనత పొందుతానని” యెహోవా తెలియజేస్తున్నారు.
“మీరు ఎక్కువ ఆశించారు కాని కొంచెమే వచ్చింది. మీరు ఇంటికి తెచ్చిన దానిని నేను చెదరగొట్టాను. ఎందుకు? అని సైన్యాలకు యెహోవా అంటున్నారు. ఎందుకంటే నా మందిరం పాడైపోయి ఉండగా మీరంతా మీ ఇళ్ళు కట్టుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కాబట్టి మీ కారణంగా ఆకాశం నుండి మంచు కురవలేదు భూమి పంటలు పండలేదు.
పొలాలు పర్వతాల విషయంలో ధాన్యం క్రొత్త ద్రాక్షరసం విషయంలో నూనె విషయంలో భూమి పండించే చేసే ప్రతి దాని విషయంలో మనుష్యులు పశువుల విషయంలో చేతి పనులన్నిటి విషయంలో కరువు రప్పించాను.”
పూర్వం ఈ మందిర వైభవాన్ని చూసినవారు మీలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడది మీకు ఎలా కనబడుతోంది? దానితో పోల్చడానికి ఎందుకూ సరిపోదు కదా?
నేను ఇతర జనాలను కదిలించగా వారు తమకిష్టమైన వాటిని తీసుకువస్తారు; నేను ఈ మందిరాన్ని నా మహిమతో నింపుతాను’ ఇదే సైన్యాల యెహోవా మాట.
వెండి నాది, బంగారం నాది; ఇదే సైన్యాల యెహోవా మాట.
‘ఇప్పుడున్న మందిర వైభవం గత మందిర వైభవం కన్నా అధికంగా ఉంటుంది’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ స్థలంలో నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాను’ అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.”
“ ‘ఆ రోజు నుండి మీరు దీని గురించి బాగా ఆలోచించండి. యెహోవా మందిరంలో రాయి మీద రాయి ఉంచే ముందు మీ పరిస్థితులను గురించి ఆలోచించండి.
నేను నీ చేతి పనంతటిని తెగులుతో బూజుతో వడగండ్లతో నాశనం చేశాను. అయినా మీరు నా వైపు తిరుగలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
గిడ్డంగిలో ధాన్యమేమైనా మిగిలి ఉందా? ఇప్పటివరకు ద్రాక్షతీగె గాని అంజూరపు చెట్టు గాని దానిమ్మ చెట్టు గాని ఒలీవచెట్టు గాని ఫలించలేదు గదా! “ ‘అయితే ఈ రోజు నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.’ ”
నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను.
అందుకా దూత, “ఇవి ఏంటో నీకు తెలియదా?” అని అడిగాడు. అందుకు నేను, “నా ప్రభువా, నాకు తెలియదు” అని చెప్పాను.
అప్పుడతడు నాతో ఇలా చెప్పాడు, “జెరుబ్బాబెలు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: ‘శక్తి వలన గాని బలం వలన గాని ఇది జరుగదు కాని నా ఆత్మ వలననే ఇది జరుగుతుంది’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.
“మహా పర్వతమా! నీవు ఎంతటి దానివి? జెరుబ్బాబెలు ఎదుట నీవు నేలమట్టం అవుతావు. అప్పుడు ‘దేవుడు దీవిస్తారు గాక! దేవుడు దీవిస్తారు గాక!’ అని కేకలు వేస్తుండగా అతడు పైరాయిని తీసుకువస్తాడు.”
తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరకు ఇలా వచ్చింది:
“జెరుబ్బాబెలు చేతులు ఈ ఆలయపు పునాదిని వేశాయి; అంతే కాకుండా అతని చేతులే దానిని ముగిస్తాయి. అప్పుడు సైన్యాల యెహోవా నన్ను మీ దగ్గరకు పంపారని మీరు తెలుసుకుంటారు.
“చిన్న విషయాలు జరిగే రోజును తృణకీరించే ధైర్యం ఎవరికైనా ఉందా? భూమి అంతా సంచరించే యెహోవా యొక్క ఏడు కళ్లు జెరుబ్బాబెలు చేతిలోని మట్టపు గుండును చూసి సంతోషిస్తాయి.”
సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే.
అంతకుముందు మనుష్యులకు జీతం గాని, పశువులకు బాడిగ గాని దొరకలేదు. నేను ఒకరిపై ఒకరికి వ్యతిరేకత కలిగించాను కాబట్టి ఎవరూ క్షేమంగా తమ పనిని చేయలేకపోయారు.